News May 13, 2024

గుండెపోటుతో ఎలక్షన్ డ్యూటీ ఆఫీసర్ మృతి

image

హార్ట్ ఎటాక్‌తో ఎలక్షన్ డ్యూటీ ఆఫీసర్ మృతి చెందిన ఘటన అశ్వారావుపేట మండలంలో చోటు చేసుకుంది. పేరాయిగూడెం బూత్ నెంబర్ 165లో ఓటింగ్ విధులకు అధికారి గుండె నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. స్థానికులు అతణ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Similar News

News March 27, 2026

ఖమ్మం జిల్లాలో పలువురు తహశీల్దార్ల బదిలీ

image

జిల్లాలో పాలనా యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా కలెక్టర్ అనుదీప్ పలువురు MROలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల సమర్థ నిర్వహణే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టారు. దీనిలో భాగంగా ఖమ్మం అర్బన్ MROగా జయచందర్ డిప్యుటేషన్‌పై నియమితులయ్యారు. అలాగే కల్లూరుకు బ్రహ్మేశ్వరరావు, ఖమ్మం రూరల్‌కు వినయేందర్ రెడ్డి, నేలకొండపల్లికి రామ్ ప్రసాద్, సింగరేణికి వెంకటేశ్వర్లును బదిలీ చేశారు.

News March 26, 2026

ఇందిరమ్మ ఇళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ అనుదీప్‌

image

తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్ తండాలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ అనుదీప్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని త్వరగా గృహాలను పూర్తి చేసుకోవాలని సూచించారు. మండలంలో మంజూరైన 802 ఇళ్లలో ప్రస్తుతం 736 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు.