News May 13, 2024

నెల్లూరులో ఓటేసిన అనిల్ కుమార్ యాదవ్

image

నరసారావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొండాయపాళెంలో మున్సిపల్ స్కూలులో ఆయన ఓటు వేశారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.

Similar News

News March 4, 2026

నెల్లూరు జిల్లా నేతలకు నారా లోకేశ్ ఆత్మీయ విందు

image

నెల్లూరు జిల్లా ప్రజా ప్రతినిధులకు ఉండవల్లిలోని తన నివాసంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన అందరూ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పలు అంశాలపై మంత్రి వారితో చర్చించారు. అనంతరం అందరికీ కానుకలు అందజేశారు.

News March 3, 2026

నెల్లూరు: ప్రేమికుల మృతి.. ఎలా గుర్తించారంటే?

image

రాపూరు-చిట్వేల్ ఘాట్ రోడ్డులోని అడవిలో ప్రేమికులు <<19290866>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. మృతులు ముత్తుకూరు మండలం పంటపాలేనికి ఆలపాక ప్రసన్న కుమార్‌(24), చిట్టమూరు మండలం చింతలతోపునకు చెందిన ఎం.సావిత్రి(26)గా గుర్తించారు. తేనె సేకరణ కోసం అడవిలోకి వెళ్లిన పంగిలి గ్రామస్థులు మృతదేహాలను చూశారు. సమీపంలోని బైకుపై దొరికిన హ్యాండ్ బ్యాగులో ఉన్న ఫోన్ల ఆధారంగా మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

News March 3, 2026

నెల్లూరు: 15 పోస్టుల్లో 6 ఖాళీ..!

image

నెల్లూరు జిల్లాలో 110KM విశాలమైన సముద్ర తీర ప్రాంతం ఉంది. 53,541మంది మత్స్యకారులు ఉండగా.. 39,590 ఎకరాల ఆక్వా సాగులో ఉంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న మత్స్యశాఖలో 15 పోస్టులే ఉన్నాయి. ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ 8మందికి 4 ఖాళీలు, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ అఫ్ ఫిషరీస్ 4 పోస్టులకు 2ఖాళీలు ఉన్నాయి. దీంతో సాగరమిత్రలపై పనిభారం పెరుగుతోందని సమాచారం. వీరికి గత 4నెలలుగా జీతాలు కూడా సరిగా రావడం లేదని తెలుస్తోంది.