News May 13, 2024
పోలింగ్ లో కడప జిల్లానే టాప్

ఉమ్మడి కడప జిల్లాలో చాలా చోట్ల ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు కడప జిల్లాలో 27.02 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాష్ర్టంలోనే ఇప్పటివరకు అత్యధికంగా ఓటింగ్ నమోదైంది మన జిల్లాలోనే కావడం విశేషం. మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. దీంతో పోలీసులు అక్కడ ఉక్కుపాదం మోపుతున్నారు.
Similar News
News March 27, 2026
కడప: ఆశ వర్కర్ల నియామకంలో గోల్మాల్?

కడప జిల్లాలో ఇటీవల జరిగిన ఆశా వర్కర్ల నియామకంలో పూర్తిస్థాయిలో అవినీతి జరిగిందంటూ పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత కలిగిన మహిళలకు కాకుండా అనర్హత కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ ఆధారాలతో ఫిర్యాదు చేసిన సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎటువంటి వెరిఫికేషన్ చేయకుండా ఎవరైతే డబ్బులు ఇచ్చారో వారిని మాత్రమే నియమించారని ఆరోపణలు ఉన్నాయి.
News March 27, 2026
ఒంటిమిట్ట రామయ్య కళ్యాణానికి ముత్యాల తలంబ్రాల తయారీ ప్రారంభం

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న జరిగే సీతారాముల కళ్యాణానికి శుక్రవారం నుంచి ముత్యాల తలంబ్రాల తయారీని ప్రారంభించారు. స్థానిక టీటీడీ భక్తుల వసతి భవనంలో శ్రీవారి సేవకుల సహాయంతో ఈ కార్యక్రమంలో తలంబ్రాల పొట్లాలను తయారు చేశారు. రామయ్య కళ్యాణం రోజు 1.10 లక్షల ముత్యాల తలంబ్రాల పొట్లాలను భక్తులకు అందజేయనున్నట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
News March 27, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,950
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.13,754
*వెండి 10 గ్రాముల ధర రూ.2,328


