News May 13, 2024
‘ఓటింగ్ వివరాల్లో జాప్యం’.. విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు

లోక్‌సభ ఎన్నికల్లో తొలి రెండు విడతల పోలింగ్ వివరాలను ఈసీ వెల్లడించడంలో ఆలస్యం కావడంపై ఈనెల 17న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. జాప్యం సహా ఈసీ గణాంకాల కచ్చితత్వంపై అనుమానం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం స్వీకరించింది. ప్రాథమిక పోలింగ్ వివరాలతో పోలిస్తే తర్వాత విడుదల చేసిన డేటాలో పోలింగ్ శాతం భారీగా పెరిగిందని పిటిషనర్లు ఆరోపించారు. ఈసీ అసలు రికార్డులను వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయాలన్నారు.
Similar News
News March 10, 2026
రజినీ-కమల్ మల్టీస్టారర్ సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడేనా?

రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది దసరా లేదా దీపావళి సందర్భంగా మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నెల్సన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించనుండగా, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించనుంది. కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన ఈ మూవీ <<19199837>>ప్రోమో<<>> ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.
News March 10, 2026
ట్రంప్ కామెంట్స్.. తగ్గిన క్రూడాయిల్ ధర

ఇరాన్‌పై యుద్ధం దాదాపుగా పూర్తయిందని, త్వరలోనే ముగుస్తుందని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన <<19341728>>వ్యాఖ్యలతో<<>> క్రూడాయిల్ ధర తగ్గింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $88కి పడిపోయింది. నిన్నటితో పోలిస్తే దాదాపు 23% తగ్గింది. ఆయిల్ ధరలను నియంత్రించేందుకు ట్రంప్ అన్ని ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు అంతకుముందు వైట్ హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఇరాన్‌పై దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఆయిల్ ధరలు 50% పెరిగాయి.
News March 10, 2026
ఇరాన్‌పై యుద్ధం దాదాపుగా పూర్తయింది: ట్రంప్

ఇరాన్‌పై యుద్ధం దాదాపుగా పూర్తయిందని US ప్రెసిడెంట్ ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం ముగిసేందుకు 4-5 వారాల సమయం పడుతుందని అంచనా వేయగా, అంతకంటే ముందే పూర్తి కాబోతున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇరాన్‌కు ఇప్పుడు నేవీ, కమ్యూనికేషన్స్, ఎయిర్ ఫోర్స్ ఏవీ లేవని అన్నారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాలపై ట్రంప్ ఫోన్ కాల్‌లో చర్చించినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది.


