News May 13, 2024
పోలింగ్ బూత్‌కు వెళ్లి ఎన్నికలను బహిష్కరించొచ్చు!

ఎన్నికల్లో అభ్యర్థులు నచ్చకపోతే ‘నోటా’ ద్వారా ఓటర్లు తమ వ్యతిరేకతను తెలిపే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఓటర్లకు ‘రెఫ్యూజ్ టు ఓట్’ అనే హక్కు కూడా ఉంది. అంటే పోలింగ్ బూత్‌కు వెళ్లి ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర ఐడీ రిజిస్టర్ చేసుకున్న తర్వాత కూడా పోలింగ్‌ను బహిష్కరించొచ్చు. ఓటు ద్వారా వ్యతిరేకత తెలిపేందుకు నోటా ఉంటే, ఎన్నికల ప్రక్రియనే బహిష్కరించే హక్కు ఈ ‘రెఫ్యూజ్ టు ఓట్’ కల్పిస్తోంది.
Similar News
News March 4, 2026
ఘోరం.. ఇంటర్ పరీక్ష రాసి బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చింది

TG: నాగర్‌కర్నూల్‌లో దారుణం జరిగింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని(16) ఈనెల 2న పరీక్ష రాసి కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరింది. వైద్యుల సూచనతో స్కానింగ్ సెంటర్‌కు వెళ్లగా అక్కడే బాత్రూంలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ పసికందును తల్లితో కలిసి చెత్తబుట్టలో పడేసింది. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. KGBVలో చదువుతున్న ఈ బాలిక ఉదంతం స్థానికంగా కలకలం రేపింది.
News March 4, 2026
జొమాటో, స్విగ్గీలకు పోటీగా ర్యాపిడో ‘ఓన్లీ’

ర్యాపిడో తన ఫుడ్ డెలివరీ యాప్ ‘ఓన్లీ’ (Ownly) సేవలను బెంగళూరు వ్యాప్తంగా ప్రారంభించింది. గత 7 నెలలుగా కోరమంగళ, HSR లేఅవుట్ వంటి ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా నడిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. జొమాటో, స్విగ్గీలు రెస్టారెంట్ల నుంచి 16-30% వరకు కమీషన్ వసూలు చేస్తుంటే ‘ఓన్లీ’ మాత్రం వారి నుంచి ₹400 కంటే తక్కువ ఆర్డర్లకు ₹25, ఎక్కువ వాటికి ₹50 ఫిక్స్‌డ్ ఫీజు కలెక్ట్ చేయనుంది.
News March 4, 2026
శ్రీకాకుళం జిల్లాలో 13 ఉద్యోగాలు

శ్రీకాకుళం జిల్లా స్త్రీ&శిశు సంక్షేమం శాఖ, వన్ స్టాప్ సెంటర్‌లో 13 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు మార్చి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, సైకో సోషల్ కౌన్సిలర్, కేస్ వర్కర్, ఆఫీస్ అసిస్టెంట్, మల్టీ పర్పస్ స్టాఫ్ తదితర పోస్టులు ఉన్నాయి. వయసు 25-42ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: srikakulam.ap.gov.in/


