News May 13, 2024
మాధవీలతపై కేసు నమోదు

HYD MP స్థానం BJP అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదైంది. ఓ పోలింగ్ బూత్‌లో ముస్లిం మహిళల ముఖంపై బురఖాలను ఆమె తొలగించిన తీరుపై అభ్యంతరం వ్యక్తమైంది. దీనిపై హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డ్ కేసు నమోదుకు పోలీసులను ఆదేశించారు. అటు కొడంగల్ సభలో మోదీ, BJPలపై రేవంత్ విమర్శలను BJP నేత రఘునందన్ తప్పుబట్టారు. కోడ్ ఉల్లంఘించి రేవంత్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారని ECకి ఫిర్యాదు చేశారు.
Similar News
News March 11, 2026
ప్రియుడితో పోలీస్ స్టేషన్‌కు మోనాలిసా!

కుంభమేళాతో పాపులరైన మోనాలిసా కేరళం పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమయ్యారు. తనకు, ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌కు రక్షణ కల్పించాలని తిరువనంతపురంలోని థంపనూర్ పోలీసులను ఆశ్రయించారు. తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించలేదని ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె పేరెంట్స్‌ను పిలిచి పోలీసులు నచ్చజెప్పారు. తర్వాత తన ప్రియుడితో మోనాలిసా వెళ్లిపోయారని తెలిపారు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఫర్మాన్‌తో ఆమె ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్నారు.
News March 11, 2026
గ్యాస్ కొరత.. కాంగ్రెస్ Vs బీజేపీ

గ్యాస్ కొరతపై కాంగ్రెస్, BJP మధ్య ట్వీట్ల వార్ సాగుతోంది. ATMల ముందు(నోట్ల రద్దు), ఆక్సిజన్(కరోనా) కోసం, ఇప్పుడు గ్యాస్ కోసం జనం క్యూలో ఉన్నారని ఫొటోను INC షేర్ చేసింది. దీంతో ప్రపంచ సంక్షోభాన్ని మోదీకి ముడిపెట్టినా కాంగ్రెస్‌కు ఎవరూ ఓటేయరని BJP సపోర్టర్లు కౌంటరిస్తున్నారు. మోదీ అభివృద్ధిని ప్రస్తావిస్తున్నారు. 8PM తర్వాత పెట్రోల్ పంపులు మూసేయాలని కాంగ్రెస్ గతంలో చెప్పిందని గుర్తుచేస్తున్నారు.
News March 11, 2026
అయోధ్యను తాకిన వంట గ్యాస్ కొరత

దేశంలో నెలకొన్న వంట గ్యాస్ కొరత అయోధ్యనూ తాకింది. రామమందిరం సమీపాన ఉండే అమావా ఆలయంలోని ప్రముఖ నిత్యాన్నదాన ప్రాంగణం రామ్ రసోయ్‌లో తాత్కాలికంగా అన్నదానం నిలిపివేశారు. అయోధ్యకు వచ్చే యాత్రికుల్లో వేలాది మందికి ఈ రామ్ రసోయ్ ప్రసాదాన్ని అందిస్తుంది. కాగా LPGకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరోవైపు తిరుమలకు గ్యాస్ సరఫరా ఆపొద్దని <<19316913>>TTD<<>> ఇప్పటికే IOCLను కోరింది.


