News May 13, 2024
ఖమ్మం ఎంపీ సెగ్మెంట్ ఓటింగ్ శాతం (50.63%)

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటల వరకు ఓవరాల్‌గా 50.63%శాతం నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతమిలా. ఖమ్మం – 41.67, పాలేరు -53.70, మధిర -55.38, వైరా-53.72, సత్తుపల్లి-53.87, కొత్తగూడెం -47.60, అశ్వారావుపేట- 53.63
Similar News
News March 11, 2026
ఖమ్మంలో రేపు జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాల కోసం మార్చి 12న ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని అర్క రెనాల్ట్ షోరూంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి ఎన్.మాధవి తెలిపారు. ఫీల్డ్ సేల్స్ కన్సల్టెంట్స్, సేల్స్ టీం లీడర్స్, యూజ్డ్ కార్ ఎవల్యూటర్స్ పోస్టులకు మొత్తం 35 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, మెకానికల్ డిప్లొమా, బీటెక్ మెకానికల్ అర్హత కలిగిన 22-33 ఏళ్ల యువత సర్టిఫికెట్ జిరాక్స్‌లతో హాజరుకావాలని సూచించారు.
News March 10, 2026
ఖమ్మం: ‘ప్రజాపాలన’ పనులపై సీఎస్ సమీక్ష

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం HYD నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ సమీక్షలో పాల్గొన్నారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను సీఎస్ ఈ సందర్భంగా అధికారులకు వివరించారు.
News March 10, 2026
నక్షా లేని గ్రామాల్లో రీ-సర్వే.. సొంత భవనాల్లోకి కార్యాలయాలు

రాష్ట్రంలో భూ లావాదేవీల్లో పారదర్శకత పెంచేందుకు అత్యాధునిక ‘రోవర్’ పరికరాలతో రీ-సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, Dy.CM భట్టి విక్రమార్క వెల్లడించారు. మంగళవారం HYDలో వారు మాట్లాడుతూ.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలను సమన్వయం చేస్తూ కొత్త పోర్టల్ తీసుకువస్తామన్నారు. అలాగే సొంత భవనాలు లేని ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని ప్రకటించారు.


