News May 13, 2024

వరంగల్ ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 41.23%

image

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి-45.00%, స్టే.ఘ-47.55%, పాలకుర్తి- 45.67%, పరకాల-46.70%, వర్ధన్నపేట-41.62%, వరంగల్ ఈస్ట్-32.50%, వరంగల్ వెస్ట్-31.19%గా ఉన్నాయి.

Similar News

News March 20, 2026

యాక్షన్ ప్లాన్‌ను రెండు రోజుల్లో సమర్పించాలి: వరంగల్ కలెక్టర్

image

ప్రతి శాఖ తమ 99 రోజుల యాక్షన్ ప్లాన్‌ను రెండు రోజుల్లో సిద్ధం చేసి సమర్పించాలని కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో 99 రోజుల ప్రగతి ప్రణాళికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ జిల్లాను అభివృద్ధిలో ముందంజలో నిలిపేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా అమలు చేయాలన్నారు.

News March 20, 2026

బడ్జెట్‌లో వరంగల్‌కు అన్యాయం.. మంత్రి స్పందించాలి: బీజేపీ

image

బడ్జెట్లో వరంగల్ జిల్లాకు అన్యాయం చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వరంగల్ ఎంజీఎం, సూపర్ స్పెషలిటీ హాస్పిటల్‌కు ఒక రూపాయి కూడా కేటాయించలేదన్నారు. ఎయిర్ పోర్ట్, టెక్స్ టైల్ పార్క్, హైవే రోడ్ల మాటలేదని, గ్రేటర్ వరంగల్‌కు మరో సారి మొండిచెయ్యి చూపారని, దీనిపై జిల్లా మంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు.

News March 18, 2026

వరంగల్: రెండవ రోజు 99.9 శాతం విద్యార్థులు హాజరు

image

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల రెండవరోజు వరంగల్ జిల్లాలో మొత్తం 99.91 శాతం విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 9,482 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 9,473 మంది హాజరు కాగా 9 మంది గైర్హాజయ్యారు. మొత్తంగా హిందీ పరీక్షకు 99.91 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంగతులు జరగలేదని డీఈవో రంగయ్య తెలిపారు.