News May 13, 2024
నల్గొండ, భువనగిరి ఎంపీ సెగ్మెంట్స్ ఓటింగ్ (48.48%)

నల్గొండ, భువనగిరి పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతమిలా..భువనగిరి ఎంపీ సెగ్మెంట్ ఓటింగ్ (46.49%) .. ఇబ్రహీంపట్నం – 38.62, మునుగోడు -50.37, భువనగిరి -47.26, NKL -47.41, తుంగతుర్తి -49.19, ALR -50.44, జనగామ -47.03, NLG -46.23, దేవరకొండ-40.89, నాగార్జునసాగర్ -52.80, MLG -44.40, HNR-53.58, KDD-52.33, సూర్యాపేట-48.65.
Similar News
News April 4, 2026
నల్గొండ: ALERT.. నేడే లాస్ట్ డేట్..!

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తుకు నేడే (ఏప్రిల్ 4) చివరి తేదీ. ఆ తర్వాత దరఖాస్తు చేసుకునే వారికి భారీగా ఆలస్య రుసుము వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 15 లోగా రూ.250, 20 లోగా రూ.2,500, 24 లోగా రూ.5,000 అదనంగా చెల్లించాలి. మే 2 వరకు దరఖాస్తు చేసుకునే వారు ఏకంగా రూ.10వేలు లేట్ ఫీ కట్టాల్సి ఉంటుంది. విద్యార్థులు గమనించి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News April 4, 2026
NLG: అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది కొరత

నల్గొండ జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. నల్గొండ, దేవరకొండలో ఎస్ఎఫ్‌ఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డీఓ/ఎస్ఎఫ్ఓ ఖాళీలు నల్గొండలో 1, నకిరేకల్‌లో 2, హాలియాలో 1 ఉన్నాయి. ఫైర్‌మెన్ (ఎఫ్‌ఎం) పోస్టులు దేవరకొండ, నకిరేకల్‌లో 4 చొప్పున, మిర్యాలగూడలో 3, హాలియాలో 2 ఖాళీగా ఉన్నాయి. వేసవిలో అగ్నిప్రమాదాలు పెరిగే ముప్పు ఉన్నందున వెంటనే ఈ ఖాళీలను భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
News April 4, 2026
రోడ్లపై కుప్పలు.. వాహనదారులకు తిప్పలు

నల్గొండ జిల్లాలో యాసంగి వరి కోతలు ఊపందుకున్నాయి. కల్లాలు లేకపోవడంతో రైతులు రహదారులపైనే ధాన్యం ఆరబోస్తున్నారు. జిల్లాలో 6.20 లక్షల ఎకరాల్లో సాగైన వరిలో ఇప్పటికే సగం కోతలు పూర్తయ్యాయి. రైతులు రోడ్లపై కుప్పలుగా ధాన్యం పోసి వాటి చుట్టూ రక్షణగా బండరాళ్లు పెడుతున్నారు. దీంతో రాత్రి వేళల్లో ఇవి సరిగ్గా కనిపించక ప్రయాణికులు తీవ్ర ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు దీనిపై దృష్టి సారించాలి.


