News May 13, 2024
ట్విటర్ ట్రెండింగ్‌లో ఏపీ పాలిటిక్స్

ప్రత్యక్ష ప్రచారానికి అనుమతి లేకపోవడంతో సోషల్ మీడియా వేదికగా ఏపీ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో పలు రాజకీయ పార్టీల శ్రేణులు చేస్తున్న పోస్టులు ట్విటర్‌లో దూసుకెళ్తున్నాయి. ‘APELECTIONS2024, YSRCPWinningBIG, HELLOAP_ByeByeYCP, VOTEFORGLASS, Chandrababu Naidu’ హాష్‌ట్యాగ్స్‌తో చేస్తున్న ట్వీట్స్ ట్రెండ్ అవుతున్నాయి.
Similar News
News March 4, 2026
2వేల టార్గెట్లను ధ్వంసం చేశాం: US మిలిటరీ

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఇరాన్‌లోని 2వేల లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు US సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఆ దేశ నేవీకి చెందిన ఒక సబ్‌మెరైన్ సహా 17 యుద్ధనౌకలను ధ్వంసం చేశామని తెలిపింది. ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధిలో ఒక్క ఇరాన్ షిప్పు కూడా లేదని తెలిపింది. మరోవైపు నేవీతో పాటు ఇరాన్ మిస్సైల్ సామర్థ్యాన్ని కూడా పూర్తిగా దెబ్బ తీసేలా అమెరికా దాడులు చేస్తోంది.
News March 4, 2026
దుబాయ్, ఖతర్‌లో అమెరికా లక్ష్యాలపై ఇరాన్ దాడులు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. దుబాయ్‌లోని US కాన్సులేట్ సమీపంలో ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. మరోవైపు ఖతర్‌లోని అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం అల్ ఉదైద్ లక్ష్యంగా ఇరాన్ 2 బాలిస్టిక్ మిస్సైల్స్‌ను ప్రయోగించింది. వీటిలో ఒకదాన్ని డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకోగా రెండో క్షిపణి ఎయిర్ బేస్‌ను తాకింది. ఈ ఘటనల్లో ఆస్తి నష్టం సంభవించినా ప్రాణనష్టం జరగలేదు.
News March 4, 2026
రేపు టెన్త్ హాల్ టికెట్లు విడుదల

ఏపీలో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి <


