News May 13, 2024

ఖమ్మంలో ఓటేసిన ట్రాన్స్‌జెండర్స్

image

ఖమ్మంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పట్టణంలోని రాజేంద్రనగర్ జెడ్పీ హైస్కూల్‌ పోలింగ్ కేంద్రంలో ట్రాన్స్‌జెండర్స్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ ఒకేసారి క్యూలైన్‌లో వచ్చి ఓటు వేశారు. తమను కూడా ప్రతి ఒక్కరూ గౌరవించాలని వారు కోరారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వం కల్పిస్తున్న ఓటు హక్కును వినియోగించుకుని మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోవాలని ట్రాన్స్‌జెండర్లు సూచించారు.

Similar News

News March 13, 2026

మధిర: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

image

మధిర రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో ఒడిశా రాష్ట్రానికి చెందిన శిభా భిషోయ్‌(29)కు జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ సత్తుపల్లి 6వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం.శ్రీనివాస్ గురువారం తీర్పు వెల్లడించారు. 2025 జూన్ 8న కొదుమూరు రోడ్ నిర్మాణ పనుల వద్ద సుమంత్ కుమార్ పండేను ఇనుపరాడుతో దాడి చేసి హత్య చేసినట్లు నిరూపితమైంది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులను సీపీ అభినందించారు.

News March 13, 2026

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నంబూరి నియామకం

image

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నంబూరి రామలింగేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధికారిక ప్రతినిధులుగా 27 మందిని నియమిస్తూ Ex.Mlc, BJP రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందరరావు ఉత్తర్వులు జారీ చేశారు. రామచంద్రరావు, చంద్రశేఖర్ తివారి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, బద్దం మహిపాల్ రెడ్డి నెల్లూరు కోటేశ్వరరావులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా జిల్లా నుంచి వీ.పుల్లారావు యాదవ్‌ను సైతం నియమించింది.

News March 13, 2026

ఖమ్మం: ‘గ్రీన్ గోల్డ్’ సాగుతో రైతులకు సుస్థిర ఆర్థికాభివృద్ధి

image

వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులకు నాంది పలుకుతూ సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఔషధ మొక్కల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఒకరోజు శిక్షణ, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమం విజయవంతమైంది. గురుదక్షిణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో NMPBతో పాటు కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో జరిగిన ఈ సదస్సులో DFO సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ దిశానిర్దేశం చేశారు.