News May 13, 2024

ఖమ్మం ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ శాతం (63.67%)

image

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఓవరాల్‌గా 63.67%శాతం నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతమిలా. ఖమ్మం – 51.18, పాలేరు -67.95, మధిర -68.83, వైరా-67.79, సత్తుపల్లి-67.44, కొత్తగూడెం -60.92, అశ్వారావుపేట- 68.88

Similar News

News March 3, 2026

ఖమ్మం: ఇంటింటికీ నల్లా.. పంచాయతీలకే తాగునీటి బాధ్యత

image

ఖమ్మం జిల్లాలో తాగునీటి కష్టాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ పథకం సిద్ధమైంది. ఈ పథకంలో భాగంగా గ్రామాల్లోని ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, పైపులైన్ల నిర్వహణ బాధ్యతలను ఇకపై నేరుగా గ్రామ పంచాయతీలకే అప్పగించనున్నారు. సర్పంచి అధ్యక్షతన ఉండే ‘గ్రామ నీటి, పారిశుద్ధ్య కమిటీల’ ద్వారా ప్రతి ఇంటికీ 100 శాతం నల్లా కనెక్షన్లు ఇచ్చి, నిరంతర సరఫరాను పర్యవేక్షిస్తారు.

News March 3, 2026

ఖమ్మం: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు ఫలితాలు విడుదల

image

ఖమ్మంలో జనవరిలో నిర్వహించిన డ్రాయింగ్ హయ్యర్, లోయర్ అలాగే టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేసినట్లు డీఈవో చైతన్య జైని తెలిపారు. అభ్యర్థులు తమ పుట్టిన తేదీ, రోల్ నంబర్ నమోదు చేసి ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు.

News March 3, 2026

నేడు ఖమ్మం కమిషనరేట్‌లో మద్యం దుకాణాలు బంద్‌

image

హోలీ పండుగను పురస్కరించుకుని ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి మార్చి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, బార్లు, కల్లు దుకాణాలు బంద్ చేయాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.