News May 13, 2024
రోహిత్ 50ఏళ్ల వరకూ ఆడతారు: యోగ్‌రాజ్

భారత కెప్టెన్ రోహిత్‌శర్మ ఫిట్‌నెస్, ట్రైనింగ్ గురించి ఎప్పుడూ ఆలోచించని గొప్ప క్రికెటర్ అని యువరాజ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ అన్నారు. ఒకవేళ ఫిట్‌నెస్ గురించి ఆలోచిస్తే రోహిత్ 50ఏళ్ల వరకూ క్రికెట్ ఆడతారని అభిప్రాయపడ్డారు. ఆటలో వయస్సు గురించి మాట్లాడటంలో అర్థం లేదని, 40-45 సంవత్సరాల్లో ఫిట్‌గా ఉండి బాగా ఆడితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. క్రికెట్లో వయస్సు అంశాన్ని రద్దు చేయాలని ఆయన అన్నారు.
Similar News
News March 22, 2026
‘చచ్చాడు.. సంతోషం’: ట్రంప్ నోటి దురుసు!

అమెరికాలో FBI మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్ (81) కన్నుమూశారు. 9/11 దాడుల తర్వాత FBI రూపురేఖలు మార్చిన ఆయన ట్రంప్-రష్యా సంబంధాలపై ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ కక్షను మనసులో పెట్టుకున్న ట్రంప్.. ముల్లర్ చనిపోగానే ‘చచ్చాడు.. చాలా సంతోషం. ఇక అమాయకులను వేధించలేడు’ అని అన్నారు. ఒక లెజెండరీ ఆఫీసర్ అంటూ చాలా మంది సంతాపం తెలుపుతుంటే ట్రంప్ ఇలాంటి కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది.
News March 22, 2026
కుల మీటింగ్స్‌కు వెళ్తే తప్పేంటి?: హైడ్రా కమిషనర్

కుల సమావేశాల్లో పాల్గొనడంపై వస్తున్న విమర్శలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ‘భారతదేశంలో కులాన్ని విడదీయలేం. మంచి విషయాల కోసమే వెళ్తున్నాను’ అని స్పష్టం చేశారు. తనకు పబ్లిసిటీ పిచ్చి లేదని కేవలం ప్రజల్లో అవగాహన కోసమే ఇంటర్వ్యూలు ఇస్తున్నానని చెప్పారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదన్నారు. 50 ఏళ్ల క్రితం నిర్మించిన తమ ఇంటికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయని తెలిపారు.
News March 22, 2026
మార్చి 22: చరిత్రలో ఈరోజు

1868: అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ మిల్లికాన్ జననం
2000: ఇన్సాట్-3బీ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది
2005: తమిళ నటుడు జెమినీ గణేశన్ మరణం
2009: సినీ నటుడు, నిర్మాత కాంతారావు మరణం (ఫొటోలో)
* ప్రపంచ జల దినోత్సవం


