News May 13, 2024
కంకిపాడులో ఓటు వేసిన సినీ నటి శ్రీరెడ్డి

కృష్ణా జిల్లా కంకిపాడులోని స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రంలో, సోమవారం సినీ నటి శ్రీరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేసి వెళ్లారు. పంచాయతీ బూత్‌లో ఓటింగ్ కార్యక్రమం సజావుగా కొనసాగుతోంది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో మళ్లీ మంచి ప్రభుత్వం ఏర్పడుతోందని తెలిపారు.
Similar News
News March 12, 2026
కృష్ణా జిల్లాకు 74.8 కోట్లు మంజూరు

అన్నదాత సుఖీభవ-PM కిసాన్ పథకం మూడో విడత నిధులు శుక్రవారం కృష్ణా జిల్లా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. 1.33 లక్షల మంది రైతులకు రూ.74.8 కోట్లు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విడతలో రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.6,000ల చొప్పున జమ అవుతాయన్నారు. రైతులు ఈ నిధులను తదుపరి పంట సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు వంటి వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు.
News March 12, 2026
కృష్ణమ్మ చెంత.. ఇసుకాసురుల పంజా!

విజయవాడ-అవనిగడ్డ కరకట్ట వెంబడి <<19359993>>ఇసుక దోపిడీ<<>> జోరుగా సాగుతోంది. ఒక మీటరు తవ్వాలన్న నిబంధనను తుంగలో తొక్కి లోతుగా తవ్వేస్తుండగా, 20 టన్నుల సామర్థ్యం గల లారీల్లో 35 టన్నుల లోడుతో యథేచ్ఛగా తరలిస్తున్నారు. మైనింగ్ మంత్రి నియోజకవర్గంలోనే అక్రమాలు జరుగుతున్నా విజిలెన్స్ తనిఖీలు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అధికారుల అండదండలతోనే ప్రభుత్వ ఖజానాకు కోట్లలో గండి పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
News March 12, 2026
కృష్ణా: ఎంత తవ్వినా చుక్క రావట్లేదు..!

దివిసీమలో <<19359974>>అక్రమ ఇసుక తవ్వకాలు<<>> భూగర్భ జలాలను కబళిస్తున్నాయి. పులిగడ్డ నుంచి VJA వరకు నిబంధనలకు విరుద్ధంగా లోతుగా తవ్వేయడంతో, గతంలో 10 అడుగులకే దొరికే నీరు ఇప్పుడు 100 అడుగుల లోతులోనూ లభించడం లేదు. ఫలితంగా సాగు, తాగునీటి కోసం రైతులు, ప్రజలు అల్లాడుతున్నారు. రెవెన్యూ, మైనింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ప్రకృతి వనరుల దోపిడీని అరికట్టాలని బాధితులుడిమాండ్ చేస్తున్నారు.


