News May 13, 2024
HYD: మ.3 గంటల వరకు పోలింగ్ ఎంతంటే?

HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ ఎలక్షన్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. మ.3 గంటల వరకు HYDలో 29.47, మల్కాజిగిరిలో 37.69, సికింద్రాబాద్ 34.58, చేవెళ్ల 45.35 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 39.92 శాతం పోలింగ్ నమోదైంది. ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు.
Similar News
News March 3, 2026
హైదరాబాద్ ఊపిరి పీల్చుకుంటోంది!

హోలీ పండుగ, గ్రహణం ఉండటంతో నగరంలో రోడ్లు, బస్సులు వెలవెలబోయాయి. సాధారణంగా రద్దీగా ఉండే ప్రధాన రహదారులు ఖాళీగా కనిపించాయి. ప్రజలు ఇళ్ల వద్దే కుటుంబాలతో పండుగ జరుపుకోవడంతో బయట రాకపోకలు తగ్గాయి. ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు బస్సుల్లో ప్రయాణికులు లేక సీట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. రంగుల సందడి కాలనీలకే పరిమితమైంది. బండ్ల పొగ లేక నగరం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటోంది.
News March 3, 2026
‘బ్లాక్‌చైన్ బస్తీ’గా పాతబస్తీ?

చార్మినార్ పరిసరాల్లోని యువత ఇప్పుడు బిర్యానీ కబుర్ల కంటే ‘బ్లాక్‌చైన్’ టెక్నాలజీ గురించే మాట్లాడుకుంటున్నారు. చిన్న ఇంటర్నెట్ సెంటర్లలో డిజిటల్ లెడ్జర్స్, క్రిప్టో కోడింగ్‌పై వర్క్‌షాపులు జోరుగా సాగుతున్నాయి. విదేశీ ప్రాజెక్టుల కోసం ఇక్కడి కుర్రాళ్లు ఫ్రీలాన్సింగ్ చేస్తూ భారీగా సంపాదిస్తూ పాతబస్తీ యువత డిజిటల్ విప్లవాన్ని సృష్టిస్తోంది. ఇది భవిష్యత్తులో HYDకు కొత్త గుర్తింపు తీసుకురావడం ఖాయం.
News March 3, 2026
GHMC: ప్రభుత్వ భవనాలే రూ.వెయ్యి కోట్ల బాకీ?

GHMC విభజన తర్వాత ఖజానా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. సుమారు ₹3,000 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు పేరుకుపోవడంతో అధికారులు చర్యలకు దిగారు. బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ అయ్యాయి. గడువులోగా చెల్లించకుంటే ఆస్తులను జప్తు చేయొచ్చు. విడ్డూరమేంటంటే.. ప్రభుత్వ భవనాలే దాదాపు ₹1,000 కోట్లు బకాయి ఉన్నాయి. సామాన్యుడిపై కొరడా ఝుళిపించే యంత్రాంగం ప్రభుత్వ సంస్థల బకాయిలను ఎలా వసూలు చేస్తుందో చూడాలి.


