News May 13, 2024

శ్రీకాకుళం: 3 గంటలకు పోలింగ్ శాతం

image

శ్రీకాకుళం నియోజకవర్గంలో మధ్యాహ్నం 3 గంటలకు మొత్తం 54.87 పోలింగ్ శాతం నమోదైందని సోమవారం అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఇచ్ఛాపురం :52.04%, పలాస:52.48%, టెక్కలి: 60.00%, పాతపట్నం: 53.45%, శ్రీకాకుళం 54.00%, ఆమదాలవలస: 56.16%, ఎచ్చెర్ల: 54%, నరసన్నపేట: 57.13% నమోదైందని వారు పేర్కొన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Similar News

News March 11, 2026

ఎచ్చెర్ల: రిజల్ట్స్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 3వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారి డాక్టర్ అనురాధ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు ఆమె వెల్లడించారు. https://brau.edu.in/ వెబ్‌సైట్‌ను విద్యార్థులు చూడాలని పేర్కొన్నారు.

News March 11, 2026

శ్రీకాకుళం: కొనసాగుతున్న ఏసీబీ దాడులు

image

రాష్ట్ర వ్యాప్త దాడుల్లో భాగంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఏసీబీ అధికారులు మంగళవారం విస్తృతంగా తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. బుధవారం సైతం ఏసీబీ సీఐలు రమణ, భాస్కర్ రావుతో కూడిన బృందం పట్టణంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ అనుమతులు ఇచ్చిన భవనాలు, నిర్మాణ నిబంధనలు వంటివి పరిశీలిస్తున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం.

News March 11, 2026

శ్రీకాకుళం: ఆగి ఉన్న కారును ఢీకొన్న లారీ

image

శ్రీకాకుళం మండలం జాతీయ రహదారిలో ఉన్న డెంటల్ కాలేజీ వద్ద బుధవారం ఆగి ఉన్న కారును లారీ ఢీకొంది. కారు మరమ్మతులకు గురికావడంతో కారులో ఉన్నవారు దిగి మెకానిక్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సమయంలోనే నరసన్నపేట నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న లారీ కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయాడు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.