News May 13, 2024
భారీ మెజార్టీతో గెలుస్తా: యూసుఫ్ పఠాన్

పశ్చిమబెంగాల్‌లోని బహరంపూర్‌లో భారీ మెజార్టీతో గెలుస్తానని భారత మాజీ క్రికెటర్, టీఎంసీ ఎంపీ అభ్యర్థి యూసుఫ్ పఠాన్ ధీమా వ్యక్తం చేశారు. తనకు ఇక్కడి ప్రజల మద్దతు ఉందని, తప్పక విజయం సాధిస్తానని తెలిపారు. యువకులు, మహిళలు అధిక సంఖ్యలో ఓటు వేయడం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ప్రజల కోసం త్యాగం చేయాల్సి వస్తే అందుకు తాను సిద్ధమని ప్రకటించారు. తాను జనం కోసం పని చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.
Similar News
News March 19, 2026
LPG గ్యాస్ ATM.. ఎక్కడంటే..?

దేశంలో గ్యాస్ కొరత నేపథ్యంలో హరియాణాలోని గురుగ్రామ్‌లో ఏర్పాటైన ‘LPG గ్యాస్ ATM’ వైరలవుతోంది. BPCL పైలట్ ప్రాజెక్టుగా ఇటీవల స్మార్ట్ వెండింగ్ మెషీన్ ఏర్పాటు చేసింది. 24×7 ఓపెన్‌లో ఉండే ఈ ATM నుంచి వినియోగదారులు 2-3 నిమిషాల్లోనే సిలిండర్ తీసుకోవచ్చు. పైగా ఐరన్‌వి కాకుండా ఫైబర్ సిలిండర్లు ఇస్తారు. వీటి బరువు 15 KGలే కావడంతో ఈజీగా తీసుకెళ్లొచ్చు. మన దగ్గరా ఇలాంటివి వస్తే బాగుంటుంది కదూ. మీరేమంటారు?
News March 19, 2026
T20 WC: BCBకి షాక్ ఇచ్చిన బంగ్లా ప్రభుత్వం!

భద్రతా కారణాలతో T20 WC నుంచి <<18951531>>తప్పుకున్న<<>> బంగ్లా క్రికెట్ బోర్డుకు ఆ దేశ ప్రభుత్వం షాకిచ్చింది. ఇండియాకు వెళ్లేందుకు జట్టు నిరాకరించడంపై విచారణ ప్రారంభించనుంది. ‘WCలో మనం ఎందుకు పాల్గొనలేదు. క్రీడా దౌత్యంలో మన లోపాలు ఎక్కడ ఉన్నాయి. వీటిని అంచనా వేయడమే విచారణ ఉద్దేశం’ అని క్రీడల శాఖ సహాయ మంత్రి అమీనుల్ హక్ చెప్పారు. ఈద్ తర్వాత విచారణ కమిటీ ఏర్పాటు చేసి, రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.