News May 13, 2024
KTDM: ముగిసిన పోలింగ్

ఏజెన్సీలో నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో అధికారులు 4గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక, ములుగు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ ముగిసింది. నక్సల్స్ ప్రభావం లేని ఖమ్మం సెగ్మెంట్లో 6గంటల వరకు పోలింగ్ సాగనుంది. క్యూలో ఉన్నవారు మాత్రం ఓటేయనున్నారు.
Similar News
News March 17, 2026
ఖమ్మం: అనర్హులకే ఇళ్ల స్థలాలా..? కలెక్టరేట్ వద్ద ధర్నా

వెలుగుమట్ల భూముల్లో అనర్హులకు స్థలాలు కేటాయించడాన్ని నిరసిస్తూ CPI(ML) ఆధ్వర్యంలో బాధితులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. 2018 నుంచి అక్కడ నివసిస్తున్న 400 మంది అసలైన పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారుల జాబితాను పునఃపరిశీలించి, అర్హులైన వారికే ఇళ్లు ఇవ్వాలని కోరుతూ అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అధికారులు స్పందించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
News March 17, 2026
ఈ నెల 22న ఖమ్మం బంద్‌కు పిలుపు

వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల ఇళ్లను కూల్చివేసిన చోటే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 22న ‘ఖమ్మం బంద్’కు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పిలుపునిచ్చింది. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు అన్నారు. వ్యాపార వర్గాలు, ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని నిరుపేదలకు అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
News March 17, 2026
ఖమ్మం రైల్వే పనుల్లో జాప్యం

ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల్లో జాప్యంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ‘అమృత్ భారత్’ పథకం కింద రూ. 25.41 కోట్లతో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రెండో నంబర్ ప్లాట్‌ఫాంపై కనీస సౌకర్యాలు లేక, మూడో లైను ప్లాట్‌ఫాం నిర్మాణం పూర్తికాక రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. 2026 గడువులోగా పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


