News May 13, 2024
మెదక్: US నుంచి వచ్చి ఓటేసిన యువ గ్రాడ్యుయేట్లు

లోక్ సభ ఎన్నికల్లో ఓటేయడానికి యూఎస్ నుంచి రావడం విశేషం. మెదక్ పట్టణానికి చెందిన మెంగని యామిని ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. ఎంపీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోవడానికి ఆమె తిరిగి వచ్చారు. అలాగే డిగ్రీ పూర్తి చేసిన అనన్య ఎరుగు మొదటిసారిగా ఓటు వేయడం ఎంతో అనుభూతినిచ్చిందని చెప్పారు. ఇది మన దేశ భవిష్యత్తును రూపొందించడంలో ప్రజాస్వామ్యం కల్పించిన బాధ్యతగా పేర్కొన్నారు.
Similar News
News March 21, 2026
రైతులు ఉత్సాహంగా పాల్గొనాలి: మెదక్ కలెక్టర్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన రైతు ఉత్సవాల’ కార్యక్రమంలో మెదక్ జిల్లా రైతులు ఉత్సాహంగా పాల్గొనాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. ఆదివారం నర్మెటలో జరిగే ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, రిఫైనరీ శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా నుంచి 2,650 మంది రైతులను తరలించేందుకు 53 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఈ అరుదైన అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 21, 2026
మెదక్: ఈసారీ నిరాశే !

రాష్ట్ర బడ్జెట్ మెదక్ జిల్లా ప్రజలను నిరాశ పరిచింది. మెతుకుసీమలో ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు ఘనపూర్ ఎత్తు పెంపు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న రైతులకు నిరాశే మిగిలింది. నూతనంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో జిల్లాలోని 1.68 లక్షల కుటుంబాలకు బీమా వర్తించనుంది. కాళేశ్వరం కెనాల్స్ పనులకు నిధులు లేవు, మెదక్ బైపాస్ రోడ్డు ప్రస్తావనేలేదు. బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
News March 20, 2026
రంజాన్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

పవిత్ర రంజాన్ పండుగను ముస్లిం సోదరులందరూ శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకాంక్షించారు. రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం, మత సామరస్యానికి ప్రతీక అని ఆమె పేర్కొన్నారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టిన ప్రతి ఒక్కరికీ ఈ పండుగ సుఖసంతోషాలను, ఆరోగ్యాన్ని చేకూర్చాలని ఆమె శుభాకాంక్షలు తెలిపారు.


