News May 13, 2024

త్వరలోనే పెళ్లి చేసుకుంటా: రాహుల్ గాంధీ

image

తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు. రాయ్‌బరేలీ కాంగ్రెస్ MP అభ్యర్థిగా బరిలో దిగిన ఆయన అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు. కాగా 53ఏళ్ల రాహుల్ పెళ్లి గురించి గతంలో ఆయన తల్లి సోనియాను ఓ అభిమాని అడగ్గా ‘మీరే ఓ మంచి పిల్లను చూడండి’ అని అన్న విషయం తెలిసిందే.

Similar News

News March 22, 2026

ఈ జిల్లాల్లో రేపు పిడుగులతో వర్షాలు!

image

AP: రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కొనసాగుతోందని APSDMA వెల్లడించింది. రేపు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, పోలవరం, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉందంది. ఉరుములు వస్తున్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో, చెట్ల కింద ఉండరాదని సూచించింది.

News March 22, 2026

ట్రంప్ అల్టిమేటమ్.. వెనక్కి తగ్గిన ఇరాన్

image

అమెరికా అధ్యక్షుడు <<19445494>>ట్రంప్<<>> 48 గంటల అల్టిమేటమ్ నేపథ్యంలో ఇరాన్ హార్ముజ్‌ విషయంలో వెనక్కి తగ్గింది. జలసంధి మీదుగా షిప్పులు వెళ్లేందుకు అంగీకరించింది. అయితే శత్రు దేశాల నౌకలను మాత్రం అనుమతించేది లేదని కండీషన్ పెట్టింది. ఆయిల్ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఇది ఊరటనిచ్చే విషయం. అయితే ఇరాన్ హార్ముజ్‌ను పూర్తిగా ఓపెన్ చేసేందుకు అంగీకరించకపోవడంతో గడువు పూర్తయ్యాక ట్రంప్ ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశమైంది.

News March 22, 2026

మహిళలకే క’న్నీటి’ కష్టాలు

image

నీటి కొరతతో ఎక్కువగా మహిళలు, బాలికలే ఇబ్బంది పడుతున్నట్లు యూఎన్ రిపోర్ట్ పేర్కొనడం చర్చనీయాంశమైంది. గ్లోబల్‌గా మహిళలు/బాలికలు నీటి సేకరణకే రోజుకు 25కోట్ల గంటలు వెచ్చిస్తున్నారు. నీరు సరఫరా లేని 70%కుపైగా గ్రామాల్లో నీటి బాధ్యత మహిళలదే. దీంతో వారి విద్యకు, ఆదాయానికి, ఆరోగ్యానికి, భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. ఇప్పటికీ 210 కోట్లకుపైగా ప్రజలకు సురక్షిత నీరు అందడం లేదు. >నేడు ప్రపంచ నీటి దినోత్సవం.