News May 13, 2024

విజయనగరం: మరో గంట మాత్రమే ఉంది.. వేకప్

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కాగా కొన్నిపోలింగ్ కేంద్రాల్లో ప్రధాన పార్టీలకు చెందిన నాయకుల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు జరగగా పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. సా.5గంటలకు కురుపాం, సాలూరులో పోలింగ్ ముగిసింది. మరో గంటలో మిగిలిన చోట్లు పోలింగ్ ముగుస్తున్న నేపథ్యంలో ఓటర్లు త్వరగా ఓటేసేందుకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఓటు వేయనట్లయితే త్వరగా వెళ్లండి. >SHARE IT

Similar News

News March 14, 2026

కొత్తవలస: యాక్సిడెంట్.. లారీ డ్రైవర్ మృతి

image

కొత్తవలస మండలం కంటకాపల్లి రైల్వే సైడింగ్ వద్ద శనివారం ప్రమాదం జరిగింది. ఎల్.కోట మండలంలో ఓ కంపెనీకి చెందిన లారీ డ్రైవరు బొగ్గు లోడింగ్ కోసం కంటకాపల్లి రైల్వే సైడింగ్‌కు వచ్చాడు. లారీ డ్రైవరు లారీకి టార్పాలిన్ కడుతూ ఉండగా జారిపోయి పడిపోయాడు. ఆ సమయంలో అటుగా మరోలారీ రావడంతో ఆ లారీ కిందపడి మృతి చెందాడు.

News March 14, 2026

VZM: సురక్షిత ఉత్పత్తులే లక్ష్యం.. మోసపోతే ప్రశ్నించండి

image

వినియోగదారులు తమ హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యురాలు శ్రీదేవి అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం విజయనగరం కలెక్టరేట్‌లో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రతి వినియోగదారుడికి రక్షణ, సమాచారం, ఎంపిక, ఫిర్యాదు చేసే హక్కులు ఉన్నాయన్నారు. ఈ ఏడాది ‘సురక్షిత ఉత్పత్తులు – నమ్మకమైన వినియోగదారులు’ నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.

News March 14, 2026

VZM: పోక్సో కోర్టులో ఈనెల 31న మొబైల్ ఫోన్ల వేలం

image

విజయనగరం జిల్లా పోక్సో కోర్టులో వివిధ క్రిమినల్ కేసులకు సంబంధించి ప్రభుత్వం జప్తు చేసిన మొబైల్ ఫోన్లను ఈ నెల 31న బహిరంగ వేలం వేయనున్నట్లు కోర్టు కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 31 సాయంత్రం 4:30 గంటలకు కోర్టు ప్రాంగణంలోనే వేలం నిర్వహిస్తామని, ఆసక్తి గల వ్యక్తులు నిర్ణీత సమయంలో వేలంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.