News May 13, 2024
IPL: కీలక మ్యాచ్‌ల టికెట్ల విక్రయం రేపే

ఐపీఎల్ క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్ & క్వాలిఫైయర్-2 మ్యాచ్‌ల టికెట్లు రేపు అందుబాటులోకి రానున్నాయి. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి పేటీఎం ఇన్‌సైడర్‌లో వీటిని విక్రయించనున్నారు. రూపే కార్డ్ ఉన్న వారు మాత్రమే వీటిని కొనుగోలు చేయొచ్చు. క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లో నిర్వహించనుండగా క్వాలిఫైయర్-2 మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది.
Similar News
News March 13, 2026
రోహిత్, కోహ్లీ కోసం BCCI స్పెషల్ ప్లాన్స్!

T20 WC విజయం తర్వాత BCCI కన్ను ఇప్పుడు 2027 ODI WCపై పడింది. రోహిత్, కోహ్లీ ODIలే ఆడుతుండగా వీరికి మరిన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించేలా విదేశీ పర్యటనల్లో అదనపు సిరీస్‌లను చేర్చేందుకు బోర్డు సిద్ధమవుతోంది. 2011 తర్వాత దక్కని వన్డే WC సాధించాలని పట్టుదలగా ఉంది. అందుకోసం NZ, ఇంగ్లండ్ వంటి జట్లతో అదనపు మ్యాచ్‌లు ఆడుతూ ఈ ఇద్దరు దిగ్గజాలను మెగా టోర్నీకి రెడీ చేసేందుకు BCCI ప్లాన్ చేస్తోంది.
News March 13, 2026
పశువుల్లో గాలికుంటు వ్యాధి లక్షణాలను ఇలా గుర్తించండి

ఈ వ్యాధి సోకిన పశువులకు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. 3, 4 వారాల్లో బొబ్బలు పగిలి పుండ్లుగా మారతాయి. చర్మం గరుకుగా మారి నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం వల్ల పశువులు మేత మేయలేవు. నీరసంగా ఉంటాయి. పశువుకు 104 నుంచి 105 డిగ్రీల ఫారన్ హీట్ వరకు జ్వరం ఉంటుంది. పాడిగేదెల్లో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఎద్దుల్లో రోగ నిరోధకశక్తి తగ్గి అలసటకు గురై నీరసంగా మారతాయి.
News March 13, 2026
స్పెర్మ్ రేసింగ్ ప్రపంచకప్.. లక్ష డాలర్ల ప్రైజ్ మనీ!

పురుషుల్లో ఫెర్టిలిటీపై అవగాహనకు ఓ US స్టార్టప్ వినూత్నంగా స్పెర్మ్ రేసింగ్ ప్రపంచకప్ నిర్వహిస్తోంది. విజేతలకు $1,00,000 (₹92.33L) ప్రైజ్ మనీ ఇస్తారు. హెల్త్, శాంపిల్స్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. మైక్రోస్కోప్‌లో వీర్యకణాలకు క్వాలిఫయింగ్ రేస్, హెడ్ టు హెడ్, ఫైనల్ నిర్వహిస్తారు. 2025లో USలో $10,000 క్యాష్ ప్రైజ్‌తో నిర్వహించిన రేస్ సక్సెస్ కావడంతో ఈసారి 128 దేశాల అథ్లెట్లతో టోర్నీ జరపనుంది.


