News May 13, 2024
RCB ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే?

చెన్నైతో మ్యాచ్‌లో బెంగళూరు మొదట బ్యాటింగ్ చేస్తే 18 పరుగుల తేడాతో గెలవాలి. అదే ఛేదనలో అయితే 18.1 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించాలి. అప్పుడు CSK కంటే RCB రన్‌రేట్ మెరుగవుతుంది. అదే సమయంలో SRH, LSG తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీపై చెన్నై గెలిస్తే బెంగళూరు ఆశలన్నీ గల్లంతై ఇంటి బాట పట్టనుంది.
Similar News
News April 3, 2026
ధురంధర్-2 సంచలనం.. ₹1,500 కోట్లు దాటిన కలెక్షన్లు

రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ధురంధర్-2 మూవీ కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. రిలీజైన 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹1,501 కోట్లు(గ్రాస్) వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ వెల్లడించింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ షేర్ చేసింది. ఇండియాలో ₹1,134 కోట్లు, విదేశాల్లో ₹367 కోట్లు రాబట్టినట్లు పేర్కొంది. ఈ మూవీలో సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ తదితరులు నటించారు.
News April 3, 2026
నాశనం చేయాలని చూస్తే శాసనం చేశాం: CBN

AP: అమరావతి రాజధానిని YCP నాశనం చేయాలని చూస్తే తాము శాసనం చేశామని CM చంద్రబాబు అన్నారు. ‘అమరావతి చట్టబద్ధత బిల్లుతో గుర్తింపు, గౌరవం దక్కాయి. VJA-GNT మధ్య రాజధానికి అనుకూలమని 46% మంది ప్రజలు చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ TDP సిద్ధాంతం. రాజధాని ఉంటేనే APకి భవిష్యత్ ఉంటుందని సంకల్పించి రాష్ట్రానికి మధ్యలో ఏర్పాటు చేశాం. నాకున్న అనుభవం వల్ల TGలోని 7 మండలాలను విలీనం చేయించాం’ అని తెలిపారు.
News April 3, 2026
మెగా మేనల్లుడి కొత్త సినిమా.. పోస్టర్ అదుర్స్

సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్ తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ‘సీక్రెట్స్ ఆఫ్ ది ఏజెస్.. పవర్ బియాండ్ ఇమాజినేషన్’ అంటూ తన 19వ సినిమా పోస్టర్‌ను విడుదల చేయగా ఆకట్టుకుంటోంది. కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ డైరెక్టర్లు సుజిత్, సందీప్ సంయుక్తంగా తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సాయి తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.


