News May 13, 2024

HYD: ఓటేసిన 104 ఏళ్ల అవ్వ..!

image

HYD శివారు శంషాబాద్ పరిధి నందిగామ మండలం వీర్లపల్లి గ్రామానికి చెందిన సట్టి రుక్కమ్మ 104 ఏళ్ల వయసులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోనే అత్యధిక వయస్కురాలు ఓటు హక్కును వినియోగించుకున్న వ్యక్తిగా రుక్కమ్మ నిలిచారు. ఎంతో మందికి రుక్కమ్మ ఆదర్శమని పలువురు నాయకులు ఆమెను కొనియాడారు.

Similar News

News March 3, 2026

HYD: మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తే.. రంగుపడుద్ది

image

హోలీ వేడుకల ముసుగులో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. రంగులు చల్లే నెపంతో వేధింపులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై కఠిన కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. నగరవ్యాప్తంగా షీ-టీమ్స్, గస్తీ బృందాలు నిరంతరం నిఘా ఉంచుతాయని తెలిపారు. ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే వెంటనే 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

News March 3, 2026

HYD: మహిళా దారుణ హత్య

image

వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం ఎల్లకొండ సమీపంలో మహిళా దారుణ హత్యకు గురైంది. ఎత్తిరాజ్‌పల్లి గ్రామానికి చెందిన బాలమణిని(45) గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి అత్యంత క్రూరంగా హత్య చేశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న మూడు తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్సై పుండ్లిక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 3, 2026

HYD: సిటీకి కొత్త సింగారం!

image

​నగరం పాత, కొత్తల కలబోతగా మారుతోంది. మార్చి 4న హోలీ వేడుకలు, హెరిటేజ్ రన్ వంటి ఈవెంట్లతో నగరం కళకళలాడుతోంది. ఫుడ్ విషయంలోనూ మన తెలుగు రుచులకే పట్టం కడుతున్నారు. చిరుధాన్యాల వంటకాలతో పాటు కొరియన్ ఫుడ్ తెగ ట్రెండ్ అవుతోంది. ఆర్గానిక్ ఫ్యాషన్, టెక్ సదస్సులతో హైటెక్ సిటీ కొత్త పుంతలు తొక్కుతోంది. పలు చోట్ల వేడుకలకు మ్యూజిక్ సిస్టమ్, గ్రౌండ్‌లోనే రెయిన్ డాన్స్‌కు వాటర్ షవర్లు ఏర్పాటు చేస్తున్నారు.