News May 13, 2024

చిత్తూరు: లండన్ నుంచి వచ్చి ఓటు హక్కు వేసిన ఉద్యోగి

image

ఎస్ఆర్ పురం మండల కేంద్రానికి చెందిన పురుషోత్తం లండన్‌లో ఉద్యోగం చేసుకుంటూ స్థిరపడ్డారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఎస్ఆర్ పురానికి చేరుకొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఒక భారతీయ పౌరుడిగా తన ఓటు హక్కు ఉపయోగించుకోవడం గర్వకారణంగా ఉందని అన్నారు. తాను ఓటు వేయడానికి సుమారు లక్ష రూపాయలు వరకు ఖర్చు చేసుకొని వచ్చానని తెలిపారు.

Similar News

News March 11, 2026

చిత్తూరులో 13న ముస్లింలకు ఇఫ్తార్ విందు

image

రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సోదరులకు “ఇఫ్తార్ విందు” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి చిన్నారెడ్డి పేర్కొన్నారు. 13వ తేదీ శుక్రవారం 5:30 గం.లకు చిత్తూరు నగరంలోని అగ్నిమాపక కేంద్రం సమీపంలోని ఉర్దూ షాదీ మహల్‌లో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ విందు ఏర్పాటు చేశారు.

News March 11, 2026

చిత్తూరు జిల్లా అధికారులు తనిఖీలు చేసేనా?

image

గ్యాస్ డిమాండ్ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేలా అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలో 46 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో సుమారు 6లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ల పంపిణీని నిలిపివేయడంతో గృహ అవసరాల సిలిండర్లని హోటళ్లకు వినియోగిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అధికారులు గ్యాస్ పక్కదారి పట్టకుండా షాపులపై తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది.

News March 11, 2026

చిత్తూరు: మల్చింగ్ పేపర్ ధరకు రెక్కలు

image

చిత్తూరు జిల్లాలో పలువురు రైతులు మల్చింగ్ పేపర్‌తో సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు. టమాటా సాగులోనూ దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం నేపథ్యంలో ముడి సరుకుల ధర పెరగడంతో మల్చింగ్ ధరకు రెక్కలు వచ్చాయి. గతేడాది ఓ రోల్ రూ.2300 ఉండగా ప్రస్తుతం రూ.3 వేల వరకు విక్రయిస్తున్నారు. అధిక ధరలకు విక్రయించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.