News May 13, 2024
అనంతపురం జిల్లాలో పలుచోట్ల ముగిసిన ఓటింగ్ ప్రక్రియ

అనంతపురం జిల్లాలో 9 గంటల సమయానికి పలుచోట్ల పోలింగ్ ముగియగా మరో పలుచోట్ల ఓటింగ్ కొనసాగుతోంది. పలుచోట్ల పోలింగ్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఓటింగ్ శాతం నియోజకవర్గాల వారిగా చూసుకుంటే రాయదుర్గం 77.6%, ఉరవకొండ 80.4%, గుంతకల్లు 71.56%, తాడిపత్రి 77.58%, శింగనమల 80.13%, అనంతపురం 64.5%, కళ్యాణదుర్గం 79.4%, రాప్తాడు 81.41 శాతంగా నమోదు అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ తెలిపారు.
Similar News
News March 18, 2026
నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన

అనంతపురం జిల్లాలోని ఒక నగరపాలక సంస్థ, ఆరు మున్సిపాలిటీలలో నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి వచ్చింది. అనంతపురం నగరపాలక సంస్థకు కలెక్టర్ ఆనంద్, తాడిపత్రికి జేసీ విష్ణు చరణ్, గుత్తికి ఆర్డీవో కేశవ నాయుడు, కళ్యాణదుర్గంకు వసంతబాబు, రాయదుర్గంకు రామకృష్ణారెడ్డి, గుంతకల్‌కు శ్రీనివాసులు పర్యవేక్షకులుగా నియమితులయ్యారు. పౌర సేవలు, అభివృద్ధి పనుల పర్యవేక్షణ వీరు చేపట్టనున్నారు.
News March 18, 2026
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్

అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సెమినార్ హాల్లో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై చర్చించారు. కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. రోగులకు మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. వారిపట్ల నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు.
News March 18, 2026
అనంతపురం పీఎల్పీ ఆవిష్కరణ

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రాధాన్యత రంగాల వార్షిక రుణ ప్రణాళిక (PLP)ను అనంతపురం కలెక్టర్ ఓ.ఆనంద్ ఆవిష్కరించారు. మొత్తం రుణ సామర్థ్యాన్ని రూ.19,93,436.31 లక్షలుగా నిర్ణయించారు. వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈలు, గృహ నిర్మాణం, పునరుత్పాదక శక్తి రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ప్రణాళికతో జిల్లా అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెరుగుదల, రైతుల ఆదాయ వృద్ధికి దోహదం అవుతుందని అధికారులు తెలిపారు.


