News May 13, 2024

శ్రీకాకుళం: ముగిసిన ఎన్నికలు.. రిసెప్షన్ సెంటర్‌కు EVMలు

image

సార్వత్రిక ఎన్నికలు – 2024 శ్రీకాకుళం జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ అధ్యక్షతన ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించారు. ఇప్పటికే ముగిసిన ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ కేంద్రాలలో ఉన్న EVMలు జిల్లాలో ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో శివాని ఇంజినీరింగ్ కళాశాలలో రిసెప్షన్ సెంటర్‌కు చేరుకుంటున్నాయి.

Similar News

News March 16, 2026

శ్రీకాకుళం జిల్లాకు నేడు వర్ష సూచన

image

అల్ప పీడన ద్రోణి, నైరుతి గాలుల ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. అకాల వర్షాలు కురిస్తే మామిడి, జీడీ మామిడి, అరటి, మొక్క జొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని జిల్లాలోని రైతులు దిగులు పడుతున్నారు. వర్షాలు, పిడుగులు పడిన సందర్భాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

News March 16, 2026

శ్రీకాకుళం: రెండు నెలల్లో.. ఐదు బ్యాంకు ఉద్యోగాలు..!

image

శ్రీకాకుళం జిల్లా గార మండలం జొన్నలపాడుకు చెందిన ఎం. స్వప్న అసాధారణ ప్రతిభతో ఆదర్శంగా నిలిచారు. వివాహం తర్వాత అత్తవారి ఇంట్లో ఉంటూనే పట్టుదలతో చదివి, కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఐదు బ్యాంకు ఉద్యోగాలను సొంతం చేసుకున్నారు. ఇందులో రెండు PO పోస్టులు, రెండు క్లర్క్ పోస్టులు, ఒక జూనియర్ అసోసియేట్ ఉద్యోగం ఉన్నాయి. విశాఖపట్నంకు చెందిన స్వప్న, తన విజయంతో మహిళల ఆత్మవిశ్వాసాన్ని చాటిచెప్పారు.

News March 16, 2026

బూర్జ: టిప్పర్ ఢీకొని యువకుడి దుర్మరణం

image

టిప్పర్ ఢీకొని ద్విచక్రవాహనదారుడు మృతి చెందిన ఘటన బూర్జ మండలంలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. ఉప్పినివలస గ్రామానికి చెందిన జీవన్ కుమార్ (32) తన పనులను ముగించుకొని కొల్లివలస నుంచి స్వగ్రామానికి బైక్‌పై వస్తుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొని తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసు కేసు నమోదైంది.