News May 14, 2024
KMM: 11 మంది నామినేషన్ ఉపసంహరణ

ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. మొత్తం 11 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బండారు నాగరాజు (యువతరం పార్టీ) స్వతంత్ర అభ్యర్థులు పోతుల ప్రార్థన, పోతుల యాదగిరి, సోమగాని నరేందర్, గంగిరెడ్డి కోటిరెడ్డి, బండారు నాగరాజు, దైద సోమ సుందరం, రత్నం ప్రవీణ్, కేడారి మేకల, రత్నం ప్రవీణ్, రేకల సైదులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
Similar News
News March 11, 2026
ఖమ్మం: టెన్త్ పరీక్షలకు 98 కేంద్రాలు ఏర్పాటు

ఈనెల 14న ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షల కోసం అధికారులు జిల్లావ్యాప్తంగా 98 కేంద్రాలను ఎంపిక చేశారు. అత్యధికంగా ఖమ్మం నగరంలోనే కేంద్రాలు ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా మండలాల్లో కేంద్రాలను ఎంపిక చేశారు. ఈ ఏడాది పరీక్షలకు 16,975 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 6 ఫ్లయింగ్ స్కాడ్‌లను ఏర్పాటు చేయగా, ప్రతి ఫ్లయింగ్ స్కాడ్‌లో డిప్యూటీ తహశీల్దార్, ఎస్‌ఐ సభ్యులుగా ఉండనున్నారు.
News March 11, 2026
ఖమ్మం: స్త్రీనిధి బకాయిలపై మెప్మా నజర్

ఖమ్మం జిల్లాలో స్త్రీనిధి రుణాల వసూళ్లపై మెప్మా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బకాయిల రికవరీని ముమ్మరం చేశారు. ఈ నెల 20లోపు రూ.25 లక్షల వసూలు లక్ష్యం కాగా, ఇప్పటికే రూ.23 లక్షలు రికవరీ చేశారు. సకాలంలో రుణాలు చెల్లిస్తేనే మళ్లీ కొత్త రుణాలు అందుతాయని, బకాయిలు పడితే సంఘాలకు వచ్చే ఇబ్బందులపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు.
News March 11, 2026
KMM: నీరా కేఫ్ లీజుకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ‘నీరా కేఫ్’ భవనాన్ని లీజుకు ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జ్యోతి తెలిపారు. కల్లు గీత కార్మిక సహకార సంఘాల్లో నమోదై, నీరా సేకరణ అనుమతి ఉన్నవారు ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గలవారు వివరాల కోసం www.tgttcfc.com వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. గౌడ వృత్తిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.


