News May 14, 2024

ADB: ఓటు వేసి విదేశాలకు వెళ్లిన వైద్యులు

image

ఓటుహక్కు తెలిసినవారు పోలింగ్ సమయంలో ఎక్కడున్నా తమ గ్రామానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఆదిలాబాద్‌కు చెందిన వైద్యులు ప్రవీణ్ అగర్వాల్ దంపతులు యూరప్‌లో ఉంటున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ కు వచ్చిన ఆయన ఓటువేయాలని సంకల్పంతో ఈనెల 13న ఓటు వేసిన తర్వాత యూరప్ కు వెళ్లాలని నిర్ధారించుకున్నాడు. దీంతో సోమవారం ప్రవీణ్ దంపతులు ఓటువేసి యూరప్‌కు బయలుదేరారు.

Similar News

News March 25, 2026

ADB: పెట్రోల్ కొరత లేదు.. పుకార్లను నమ్మకండి: ఎస్పీ

image

ఆదిలాబాద్ జిల్లాలో పెట్రోల్ కొరత ఉందనే పుకార్లను నమ్మవద్దని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే ముప్పు ఉందని హెచ్చరించారు. జిల్లాలో తగినంత పెట్రోల్ నిల్వలు ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా బహిరంగంగా పెట్రోల్ విక్రయిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.

News March 25, 2026

పెట్రొల్ పై అసత్య ప్రచారం నమ్మొద్దు: ADB కలెక్టర్

image

జిల్లాలో ఎక్కడా ‘స్టాక్ లేదు’ అనే బోర్డులు కనిపించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. అత్యవసర సేవల వాహనాలకు ఇంధన సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, ఎలాంటి సమస్యలు లేదా సందేహాల నివృత్తి కోసం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 1939ను సంప్రదించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

News March 25, 2026

ఇంధన కొరతకు లేకుండా అప్రమత్తంగా ఉండాలి: ADB కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం సంబంధిత శాఖల అధికారులు, పెట్రోల్ బంక్ డీలర్లతో నిర్వహించిన జూమ్ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇంధన కొరత తలెత్తకుండా నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ, సరఫరా నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.