News May 14, 2024
జిల్లాలో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది: కడప కలెక్టర్

కడప జిల్లాలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ వి.విజయ్ రామరాజు సోమవారం రాత్రి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగిందన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం కాగా, నిర్ణీత సమయానికి పోలింగ్ కేంద్రంలో ఉన్న అందరికీ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News March 17, 2026
సిద్దవటం: భర్త హత్య కేసులో భార్యకు జీవిత ఖైదు

సిద్దవటం మండలంలోని కపర్దేశ్వర స్వామి కోన వద్ద 2014లో జరిగిన హత్య కేసులో నలుగురు ముద్దాయిలకు కోర్టు జీవిత ఖైదు విధించింది. భర్తను హత్య చేసి బంగారు నగలు దోచుకున్న కేసులో భార్యతో పాటు మరో ముగ్గురిపై నేరం రుజువవడంతో కడప కోర్టు ఒక్కొక్కరికి జీవిత ఖైదు, రూ.2000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.
News March 17, 2026
అవినీతి ఆరోపణలపై కడప కార్పొరేషన్ ఇంజినీర్ల పెన్షన్లలో కోత

కడప మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజినీరింగ్ విభాగంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ముగ్గురు రిటైడ్ ఇంజినీర్ల పెన్షన్లలో కోత విధిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ACB ఫిర్యాదుపై విచారణ జరిపిన ప్రభుత్వం పదవీ విరమణ చేసిన ఇంజినీర్లు శ్రీనివాసులు, దస్తగిరి రెడ్డి, దౌలాకు వారి పెన్షన్లో 5 శాతం కోత విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పనులను విభజించి, నామినేషన్‌పై కట్టబెట్టడంపై చర్యలు తీసుకున్నారు.
News March 17, 2026
జిల్లాలో పలువురు డిప్యూటీ ఎమ్మార్వోలకు తాత్కాలిక పదోన్నతులు

కడప జిల్లాలో పలువురు డిప్యూటీ ఎమ్మార్వోలకు తాత్కాలిక పదోన్నతులు కల్పించి బదిలీ చేస్తూ సోమవారం కలెక్టర్ శ్రీధర్ ఉత్తర్వులు ఇచ్చారు. వారి పోస్టింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.
➤ శివలక్ష్మి – నందలూరు, ➤ విజయకుమారి – చెన్నూరు
➤ లక్ష్మీనారాయణ – కడప అర్బన్, ➤ లక్ష్మమ్మ – టి సుండుపల్లె
➤ షఫీ – మైలవరం, మనోజ్ – బి.కోడూరుకు తహసీల్దార్లుగా బదిలీ పదోన్నతులు కల్పిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు.


