News May 14, 2024

ఈరోజు ఓటేసిన వారికి థాంక్స్: పీఎం మోదీ

image

దేశవ్యాప్తంగా ఈరోజు ఓటేసిన వారందరికీ ప్రధాని మోదీ ట్విటర్‌లో కృతజ్ఞతలు తెలిపారు. ‘స్థిరమైన, బలమైన దేశాభివృద్ధి కోసం ప్రజలు ఎన్డీయే వైపే మొగ్గు చూపుతున్నారని అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతి చోటా ఎన్డీయే అభ్యర్థులకు భారీ మద్దతు లభిస్తోంది. INDI కూటమి అసలు ప్రజల చర్చల్లోనే లేదు’ అని పోస్ట్ చేశారు.

Similar News

News March 16, 2026

నందిని సిధారెడ్డికి సాహిత్య అకాడమీ అవార్డు

image

TG: ప్రముఖ రచయిత నందిని సిధారెడ్డి రచించిన ‘అనిమేష’ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 24 భారతీయ భాషలలో ఈ సాహిత్య అవార్డులను అకాడమీ ప్రకటించింది. ‘అనిమేష’తో పాటు ఆయా భాషల్లోని రచయితల సాహిత్య పుస్తకాలకు అవార్డులను ప్రకటించింది. కొవిడ్ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న వేదన, భయం, సంఘర్షణలను ప్రతిబింబించే కావ్యమిది. అప్పటి పరిస్థితులను అక్షరరూపంలో కళ్లకు కట్టేలా రచయిత ఆవిష్కరించారు.

News March 16, 2026

20న రాష్ట్ర బడ్జెట్.. 30 వరకు సమావేశాలు

image

TG: ఇవాళ ప్రారంభమైన రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించాలని BAC భేటీలో నిర్ణయించారు. ఇక 20వ తేదీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు ఉగాది(19), రంజాన్(21), శ్రీరామనవమి(27) పర్వదినాల వేళ అసెంబ్లీకి సెలవు ఉండనుంది.

News March 16, 2026

రోహిత్ రెడ్డి ఆహ్వానంతోనే పార్టీకి వచ్చారు: FIR

image

TG: మొయినాబాద్ <<19386155>>కేసులో<<>> మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఆయన ఆహ్వానంతోనే నిందితులు పార్టీకి వచ్చినట్లు FIRలో వెల్లడైంది. 11 మందిని పరీక్షించగా ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని, సిమ్లాలో కొకైన్ కొన్నట్టు నిందితుడు కౌశిక్ అంగీకరించినట్లు పేర్కొంది. పోలీసులమని చెప్పినా షూట్ చేశారని.. రోహిత్ రెడ్డి సోదరుడైన రితేశ్ రెడ్డి పేరున ఉన్న ఆ గన్‌ను సీజ్ చేసినట్లు పేర్కొంది.