News May 14, 2024
పలు గ్రామాల్లో పోలింగ్ బహిష్కరణ

TG: రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల నిన్న పోలింగ్‌ను ఓటర్లు బహిష్కరించారు. యాదాద్రి జిల్లా కనుముకుల గ్రామంలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో, కడెం మండలం అల్లంపల్లిలో రోడ్డు గురించి, ఖమ్మం జిల్లా రాయమాదారం గ్రామస్థులు వంతెన గురించి, మైనింగ్ అనుమతులు రద్దు చేయాలన్న డిమాండ్‌తో బల్మూరు మండలం మైలారం గ్రామస్థులు ఓటింగ్‌ను బహిష్కరించారు. అధికారులు ప్రజలకు నచ్చజెప్పి ఓటింగ్ వేయించారు.
Similar News
News March 21, 2026
అమెరికాకు ‘క్విడ్ ప్రోకో’ ప్రతిపాదన చేయలేదు: రష్యా

ఉక్రెయిన్‌కు మద్దతును అమెరికా ఉపసంహరించుకుంటే తాము ఇరాన్‌కు ఇంటెలిజెన్స్ సాయాన్ని నిలిపివేస్తామని రష్యా ఆఫర్ ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. వీటిని రష్యా ఖండించింది. అమెరికాతో ఎలాంటి క్విడ్ ప్రోకో ప్రతిపాదన జరగలేదని, ఇవన్నీ ఫేక్ వార్తలని స్పష్టం చేసింది. పుతిన్ రాయబారి కిరిల్ దిమిత్రీవ్ ఈ ఐడియాను ప్రతిపాదించినట్లు నివేదికలు పేర్కొనగా, ఆయన దీనిని X వేదికగా ఖండించారు.
News March 21, 2026
ఆడియన్స్ సీట్లకు అతుక్కుపోయారు: రాజమౌళి

‘ధురంధర్-2’ 4 గంటల నిడివి ఉన్నా ఆడియన్స్ లాస్ట్ ఫ్రేమ్ వరకు సీట్లకు అతుక్కుపోయారని డైరెక్టర్ రాజమౌళి అన్నారు. ఇంతటి లెన్త్ ఉన్న మూవీని రిలీజ్ చేయడానికి గట్స్ ఉండాలని చెప్పారు. తనకు ధురంధర్ నచ్చిందని, ధురంధర్-2 అంతకంటే బాగుందని కొనియాడారు. రైటింగ్, కాస్టింగ్, మ్యూజిక్, డైరెక్షన్ ఇలా అన్ని విభాగాల్లో మూవీ అద్భుతంగా ఉందని ట్వీట్ చేశారు. రణ్‌వీర్, మాధవన్ నటనలో మాస్టర్ క్లాస్ చూపించారన్నారు.
News March 21, 2026
పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ సీజ్

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పార్టీకి ఉపయోగించిన ఫామ్‌హౌస్‌ను పోలీసులు సీజ్ చేశారు. అసైన్డ్ భూమిలో దాన్ని కట్టారని అధికారులు తేల్చగా, పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు పార్టీకి వచ్చినవారి వాహనాలనూ సీజ్ చేశారు.


