News May 14, 2024
లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పోలింగ్..
TGలో భువనగిరిలో 76.47%, KMMలో 75.19%, జహీరాబాద్‌లో 74.54%, మెదక్‌లో 74.38%, నల్గొండలో 73.78%, KNRలో 72.33%, ఆదిలాబాద్‌లో 72.96%, MBNRలో 71.54%, మహబూబాబాద్‌లో 70.68%, NZMBలో 71.50%, నాగర్ కర్నూల్‌లో 68.86%, WGLలో 68.29%, PDPLలో 67.88%, చేవెళ్లలో 55.45%, SECBADలో 48.11%, మల్కాజిగిరిలో 50.12%, HYDలో 46.08% ఓటింగ్ నమోదైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి 50.34% పోలింగ్ జరిగింది.
Similar News
News January 10, 2025
ఓటీటీలోకి సూపర్ హిట్ చిత్రం
బాసిల్ జోసెఫ్, నజ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ ‘సూక్ష్మదర్శిని’ రేపు ఓటీటీలోకి రానుంది. డిస్నీ+హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 22న విడుదలై దాదాపు రూ.60కోట్ల కలెక్షన్లను సాధించింది. ఎంసీ జతిన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు IMDbలో 8.1 రేటింగ్ ఉంది.
News January 10, 2025
మెలోడీతో మీమ్స్.. స్పందించిన ప్రధాని మోదీ
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో తాను కలిసి ఉన్న ‘మెలోడీ’ మీమ్స్‌పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘అది ఎప్పుడూ జరిగేదే. దాని గురించి ఆలోచించి నా సమయం వృథా చేసుకోను’ అని ఆయన చెప్పారు. WTF సిరీస్‌లో భాగంగా జెరోదా కో ఫౌండర్ నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్ కాస్ట్‌లో మోదీ మాట్లాడారు. అలాగే తన చిన్నప్పుడు ఇంట్లో వారి బట్టలన్నీ తానే ఉతికేవాడినని చెప్పారు.
News January 10, 2025
ప్రభాస్ అభిమానులకు గుడ్, బ్యాడ్ న్యూస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు ఓ గుడ్, బ్యాడ్ న్యూస్ అందనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ మూవీ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేస్తారని సమాచారం. మరోవైపు ఈ చిత్ర విడుదలను ఏప్రిల్ 10 నుంచి వాయిదా వేస్తున్నట్లు టాక్. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. మారుతి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.