News May 14, 2024

నేడు వారణాసికి చంద్రబాబు

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబు నేడు యూపీలోని వారణాసికి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి రావాలని ఎన్డీయే మిత్రపక్షాలకు బీజేపీ ఆహ్వానం పంపింది. దీంతో చంద్రబాబు ప్రత్యేక విమానంలో వారణాసికి వెళ్లి, రాత్రికి తిరుగుపయనమవుతారు. ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ వారణాసికి చేరుకున్నారు.

Similar News

News January 10, 2025

శీతాకాలంలో బాదం ప్రయోజనాలెన్నో

image

శీతాకాలంలో తరచూ అనారోగ్యాలు దాడి చేస్తుంటాయి. వాటి నుంచి రక్షణ కలిగేలా రోగనిరోధక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు బాదం గింజలు ఉపకరిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ‘బాదంలో విటమిన్-ఈ, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, రిబోఫ్లావిన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. బరువు నియంత్రణకు, శరీరం వెచ్చగా ఉండేందుకు ఇవి మేలు చేస్తాయి. బాదం గింజల్ని రోజూ తినడం మంచిది’ అని పేర్కొంటున్నారు.

News January 10, 2025

భారత క్రికెటర్ నితీశ్ రెడ్డికి ACA సన్మానం

image

టీమ్ ఇండియా క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిని ACA (ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్) ఘనంగా సన్మానించింది. బీజీటీ సిరీస్‌లో గొప్పగా ఆడినందుకు ఆయనను అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. త్వరలో ఏసీఏ ఆయనకు ప్రకటించిన రూ.25 లక్షల చెక్కును అందించనుంది. కాగా బీజీటీలో నితీశ్ 298 పరుగులతో టోర్నీలో నాలుగో టాప్ స్కోరర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. బాక్సింగ్ డే టెస్టులో సెంచరీతోనూ చెలరేగారు.

News January 10, 2025

ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

image

ఏపీలో జగనన్న కాలనీల పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఎంఏవై-ఎన్టీఆర్ నగర్‌గా పేరు మారుస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధులతో ప్రజలకు ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణాలు చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది.