News May 14, 2024

తిరుపతి: ఓటేసి వెళ్తుండగా మృతి

image

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గాదంకి టోల్ ప్లాజా సమీపంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు <<13243541>>చనిపోయిన <<>>విషయం తెలిసిందే. మృతుడు అమాసవారిపల్లికి చెందిన ఎ.గురుస్వామి(65)గా గుర్తించారు. ఆయన ఓటు వేయడానికి వెళ్లగా చీకటి పడింది. ఓటు వేసి తిరిగి ఇంటికి నడిచి వస్తుండగా.. రోడ్డు పక్కన గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఆయన అక్కడికక్కడే చనిపోయాడు.

Similar News

News March 10, 2026

చిత్తూరు: ఏడుగురు సర్వేయర్లకు షోకాజ్ నోటీసులు

image

ఏడుగురు గ్రామ సర్వేయర్లకు షోకాజ్ నోటీసులు జారీచేస్తూ జిల్లా సర్వే భూరికార్డుల శాఖ ఏడీ పుల్లయ్య ఉత్తర్వులు జారీచేశారు. తోటి సర్వేయర్లను విధులకు హాజరు కానీయకుండా చేశారనే కారణంతో సర్వేయర్ల యూనియన్ ఆఫీస్ బేరర్స్‌లోని నాయకులకు షోకాజ్ ఇచ్చారు. ఇదే వ్యవహారంలో గతంలో ముగ్గురు సర్వేయర్లను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

News March 10, 2026

రెస్కో పరిధిలో వన్ టైం సెటిల్మెంట్

image

కుప్పం రెస్కో పరిధిలో వన్ టైం సెటిల్మెంట్ పథకం అమలు చేస్తున్నట్లు రెస్కో చైర్మన్ ప్రతాప్ తెలిపారు. మార్చి 10 నుంచి 25 వరకు వన్ టైం సెటిల్మెంట్ పథకం అమలు చేయడం జరుగుతుందని, రెస్కో పరిధిలో గృహ వినియోగదారులు 31.01.2026 వరకు పాత బకాయిలు ఉంటే పూర్తిగా వడ్డీ మాఫీ (సర్ చార్జ్) తో బిల్లులు చెల్లించవచ్చన్నారు. రెస్కో పరిధిలోని గృహ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.