News May 14, 2024
భార్య ఓటు లేదని… ఓ వ్యక్తి వీరంగం!

ఓటరు జాబితాలో తన భార్య పేరు లేదని ఓ వ్యక్తి వీరంగం సృష్టించిన ఘటన NKL జడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. NKL శివాలయం వీధిలో నివాసం ఉండే ఓ వ్యక్తి ఓటు వేసేందుకు కుటుంబంతో పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. జాబితాలో అతని భార్య పేరు తొలగింపునకు గురైంది. 5 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో తను ఓటు వేసిందని. ఇపుడు ఎందుకు లేదని బీఎల్వోలతో వాగ్వాదానికి దిగాడు.
Similar News
News March 26, 2026
నాగార్జునసాగర్: క్యాంటీన్ లేక టూరిస్టుల అవస్థలు

విజయవిహార్ వద్ద కనీస క్యాంటీన్ సౌకర్యం లేకపోవడంతో సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు తాగునీరు, తినుబండారాలు దొరకక ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా కుటుంబాలతో వచ్చే వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. సంబంధిత పర్యాటక శాఖ అధికారులు స్పందించి, వెంటనే అక్కడ క్యాంటీన్ ఏర్పాటు చేసి కనీస వసతులు కల్పించాలని పర్యాటకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
News March 26, 2026
NLG: వానాకాలం సాగుకు ‘కార్యాచరణ’ సిద్ధం!

రాబోయే వానాకాలం సీజన్‌కు సంబంధించి జిల్లా వ్యవసాయ శాఖ యాక్షన్ ప్లాన్‌ను ప్రభుత్వానికి నివేదించింది. జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం, ఎరువుల అవసరం వంటి అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసిన అధికారులు, ఈసారి రికార్డు స్థాయి సాగును అంచనా వేస్తున్నారు. ఈ వానాకాలం సీజన్‌లో జిల్లావ్యాప్తంగా మొత్తం 12.02 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. సింహభాగం వరి, పత్తి పంటలదే కావడం విశేషం.
News March 26, 2026
NLG: ఏప్రిల్ 1 నుంచి మూల్యాంకనం

పదో తరగతి పరీక్షల నిర్వహణలో వేగం పెంచిన విద్యాశాఖ, అదే వేగంతో జవాబు పత్రాల మూల్యాంకనానికి కూడా ముహూర్తం ఖరారు చేసింది. ఈనెల 28వ తేదీ నుంచే జవాబు పత్రాల కోడింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్ణీత కేంద్రాల్లో మూల్యాంకనం కొనసాగనుంది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని ప్రధాన కేంద్రాలను ఇప్పటికే పరీక్షల విభాగం సిద్ధం చేసినట్లు సమాచారం.


