News May 14, 2024

తాజా అప్‌డేట్: ఉమ్మడి తూ.గో.లో అత్యధిక పోలింగ్ ఇక్కడే

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో ఓటర్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అత్యధికంగా 83.19% పోలింగ్ నమోదైంది. తూర్పు గోదావరి జిల్లాలో 79.31%, కాకినాడ జిల్లాలో 76.37% నమోదైనట్లు అధికారులు తెలిపారు. నియోజకవర్గాల వారీగా చూస్తే.. మండపేటలో అత్యధికంగా 87.50%, అత్యల్పంగా రాజమండ్రి సిటీలో 67.59% పోలింగ్ నమోదైంది.
NOTE: పూర్తి గణాంకాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. పోలింగ్ శాతం మరింత పెరగొచ్చు.

Similar News

News October 1, 2024

తూ.గో: కొండ వాగులో బాలుడి మృతదేహం లభ్యం

image

అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు విగత జీవిగా వాగు నీటిలో తేలడం చూసి ఆ తల్లిదండ్రుల హృదయం ముక్కలైంది. తూ.గో జిల్లా సీతానగరానికి చెందిన పదో తరగతి విద్యార్థి వినయ్(15) కొండ గోదావరి వాగులో ఆదివారం <<14229819>>గల్లంతైన విషయం<<>> తెలిసిందే. గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం మృతదేహం లభ్యమైంది. స్నేహితులతో కలిసి సరదాగా ఫొటోషూట్‌కి వెళ్లిన కొడుకు శవమై ఇంటికి రావడంతో తల్లి వరలక్ష్మి, తండ్రి శ్రీనివాస్ బోరున విలపించారు.

News October 1, 2024

లబ్ధిదారులందరికీ సకాలంలో పెన్షన్ల పంపిణీ: మంత్రి దుర్గేష్

image

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులకు సకాలంలో ఇండ్ల వద్దకే వెళ్లి పెన్షన్లను అందిస్తున్నామని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ మేరకు ఆయన తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం విజ్జేశ్వరం గ్రామంలో మంగళవారం ఉదయం సచివాలయ సిబ్బంది నిర్వహించిన పెన్షన్ల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. అదేవిధంగా లబ్ధిదారులకు ఆయన పెన్షన్ల సొమ్మును అందజేశారు.

News October 1, 2024

కోనసీమ: మహిళ ఫిర్యాదు.. మాజీ MPTC అరెస్ట్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట రూరల్ మండలానికి చెందిన మాజీ MPTC, RBK ఛైర్మన్ చందర్రావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు SI సురేష్‌బాబు సోమవారం తెలిపారు. మాజీ MPTC చందర్రావు తనను దుర్భాషలాడుతూ కొట్టాడని కేశవరానికి చెందిన మంగాదేవి గత నెల 20వ తేదీన ఫిర్యాదు చేసినట్లు SI పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు ఆధారంగా చందర్రావును అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చగా, జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారన్నారు.