News May 14, 2024

కారంచేడు: భర్త మృతి.. ఆ బాధలోనూ ఓటేసిన భార్య

image

బాపట్ల జిల్లా కారంచేడులో ఓ మహిళ ఓటు విలువను చాటారు. గర్నెపూడి చిట్టెమ్మ గ్రామంలో వీవోఏగా పని చేస్తున్నారు. అనారోగ్య సమస్యలతో సోమవారం ఆమె భర్త సింగయ్య(62) మృతిచెందారు. కాగా, ఆ బాధలోనూ ఆమె ఓటు వేయాల్సిన బాధ్యతను మరవలేదు. 178వ పోలింగ్ కేంద్రంలో ఓటేసి పలువురికి ఆమె ఆదర్శంగా నిలిచారు.

Similar News

News March 10, 2026

వేసవి కార్యాచరణకు సిద్ధం: GNT కలెక్టర్

image

రానున్న వేసవి దృష్ట్యా ముందస్తు చర్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గుంటూరు జిల్లాలో వేసవి కార్యాచరణకు తాము పూర్తి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఈ సందర్భంగా తెలిపారు. తాగునీటి సరఫరా, వైద్యం, అగ్నిమాపక సేవలపై రెవెన్యూ, మున్సిపల్, ఆరోగ్య శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు వివరించారు.

News March 10, 2026

ఉండవల్లి: ప్రమాదంలో వృద్ధురాలు స్పాట్‌డెడ్

image

తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి సాయిబాబా గుడి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన నల్లమట్టి టిప్పర్ ఢీకొనడంతో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. అనుమతులు లేకుండా, అతివేగంతో మట్టి లారీలు తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News March 10, 2026

అమరావతిలో డబుల్ ట్రీ హిల్టన్ హోటల్‌కు భూమిపూజ

image

అమరావతి ప్రాంతంలోని మందడంలో 200 గదులతో ఫైవ్ స్టార్ డబుల్ ట్రీ (హిల్టన్) హోటల్, 10,000 మంది సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి భూమిపూజ జరిగింది. రూ.330 కోట్ల పెట్టుబడితో 4 ఎకరాల్లో హోటల్, 2.5 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ నిర్మించనున్నారు. కార్యక్రమంలో సీఆర్డీఏ కమిషనర్ కె. కన్నబాబు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.