News May 14, 2024
పెదకాకాని: స్ట్రాంగ్ రూములకు ఈవీఎంల తరలింపు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌కు తరలించే ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. సోమవారం రాత్రి భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పోలింగ్ సిబ్బంది నుంచి ఈవీఎంలను తీసుకునే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుషార్ దూది, మంగళగిరి ఆర్వో జి.రాజకుమారి పాల్గొన్నారు.
Similar News
News March 7, 2026
ఈనెల 13 లోగా అభ్యంతరాలు తెలపాలి: లింగేశ్వర్ రెడ్డి

జోన్-III పరిధిలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలోని స్కూల్ అసిస్టెంట్ గేడ్-II ప్రధానోపాధ్యాయ పోస్టులకు, తాత్కాలిక సీనియారిటీ జాబితా విడుదల చేశారు. వివరాలను వెబ్ సైట్‌లో అందుబాటులో
ఉంచినట్లు ఆర్జేడీ లింగేశ్వర్ రెడ్డి తెలిపారు. సీనియారిటీ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత డీఈవో కార్యాలయంలో తగిన ఆధారాలతో ఈనెల 13వ తేదీలోగా అందజేయాలని సూచించారు.
News March 7, 2026
గుంటూరు: రేపు గురుకులాల్లో ఖాళీ సీట్లకు ప్రవేశ పరీక్ష

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లా కోఆర్డినేటర్ శ్రీదేవి ఈ విషయాన్ని వెల్లడించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ పరీక్ష ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు 6, 7 తరగతుల అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3.30 వరకు 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పరీక్ష జరుగుతుందని తెలిపారు.
News March 7, 2026
గుంటూరు: మిర్చి యార్డుకు సరకు రాకల్లో హెచ్చుతగ్గులు

గుంటూరు మిర్చి యార్డుకు వచ్చే టిక్కీల సంఖ్యలో మార్పులు కనిపిస్తున్నాయి. రెండు రోజులు లక్షా 25 వేల వరకు టిక్కీలు వచ్చినా శుక్రవారం సుమారు 88 వేలకే పరిమితమయ్యాయి. ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ ఈ తగ్గుదలకు స్పష్టమైన కారణం లేదు. హోలీ కారణంగా ఈ వారంలో నాలుగు రోజులు మాత్రమే లావాదేవీలు జరిగాయి. సోమవారం 1,04,740 టిక్కీలు రాగా తరువాత రోజుల్లో సంఖ్య పెరిగింది. ప్రస్తుతం యార్డులో 26 వేల మిర్చి బస్తాలు ఉన్నాయి.


