News May 14, 2024

తనకు తాను ఓటేసుకోని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

image

మాడుగుల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి తను పోటీ చేసిన మాడుగుల నియోజకవర్గంలో ఓటు వేయడానికి అవకాశం లేకపోయింది. పెందుర్తి నియోజకవర్గం పరిధిలో తన స్వగ్రామమైన వెన్నెలపాలెంలో తన సతీమణితో కలిసి ఓటు వేశారు. ఆఖరి నిమిషంలో మాడుగుల నియోజకవర్గం టీడీపీ టికెట్ ఖరారవ్వడంతో ఆయన ఓటును మార్చుకునే అవకాశం లేకపోయింది. కాగా.. కూటమి తరఫున పెందుర్తిలో జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్‌ పోటీలో ఉన్నారు.

Similar News

News April 3, 2026

విశాఖపట్నం-రాయ్‌పూర్ ప్యాసింజర్ రైళ్లు రద్దు

image

విశాఖపట్నం-రాయ్‌పూర్ మధ్య ప్రయాణించే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సంబల్‌పూర్ డివిజన్‌లోని మునిగూడ-బిస్సాంకటక్ మధ్య వంతెన ఆధునీకరణ పనులు చేపట్టడమే దీనికి కారణం. ఏప్రిల్ 9, 11, 13, 20, 23, 25 తేదీల్లో రైలు నంబర్లు (58528/58527) రెండు వైపులా నడవవు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ కోరారు.

News April 3, 2026

విశాఖ: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు

image

విశాఖలో గురువారం ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హెల్మెట్ ధరించనవి-1183, పిలియన్ రైడర్-242, ట్రిపుల్ రైడింగ్-66, ఆటోలపై కేసులు-3, ఓవర్ స్పీడ్-185, సెల్ఫోన్ డ్రైవింగ్-28, ఓవర్ స్పీడ్-185, డ్రైవింగ్ లైసెన్స్ లేనివి-95, రాంగ్ పార్కింగ్-209, డ్రంకెన్‌ డ్రైవ్-35, సీజ్ చేసిన వెహికల్స్-52, MVయాక్ట్ ఉల్లంఘన-441తో కలిపి మొత్తం 2,363 కేసులు నమోదయ్యాయి.

News April 3, 2026

​సింహాచలంలో ‘ఉంగరాల వేట’ వినోదం

image

​సింహాచలం వరాహ లక్ష్మీనృసింహ స్వామి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా నేడు అత్యంత ఆసక్తికరమైన ‘అంగుళీయక అన్వేషణ’ ఉత్సవం జరిగింది. భక్తికి వినోదాన్ని జోడించి స్వామివారి లీలలను కళ్లకు కట్టేలా నిర్వహించారు. కళ్యాణ సమయంలో అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన బంగారు ఉంగరం కనిపించకుండా పోయిందనే నెపంతో ఈ సరదా ఉత్సవాన్ని నిర్వహించడం ఇక్కడి అనాదిగా వస్తున్న ఆచారం.