News May 14, 2024
కోనసీమ: ఓటు వేశాక ఫిట్స్.. చికిత్స పొందుతూ మృతి

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గోగన్నమఠానికి చెందిన కర్రి సత్యనారాయణ(52) ఫిట్స్‌తో మృతి చెందాడు. గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద సోమవారం ఓటు వేసిన అనంతరం ఫిట్స్‌తో స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు వెంటనే రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని కుటుంబీకులు తెలిపారు. చేపల వేటపై ఆధారపడి జీవనం సాగించే సత్యనారాయణ మృతితో కుటుంబం పెద్దదిక్కు కోల్పోయింది.
Similar News
News April 22, 2025
తాళ్లపూడి: పుష్కరాల రేవులో శిశువు మృతదేహం లభ్యం

తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి పుష్కరాల స్నాన ఘట్టానికి వెళ్లే మార్గంలో ఆడ శిశువు మృతదేహాన్ని మంగళవారం స్థానికులు కనుగొన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొవ్వూరు సీఐ విజయబాబు ప్రాంతాన్ని సందర్శించి శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆడ శిశువు మృతదేహం లభ్యమవ్వడంతో చుట్టుపక్కల ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రులలో పోలీసులు విచారణ చేపట్టారు.
News April 22, 2025
కొవ్వూరు: ఒకే రోజు ఇద్దరు ఆత్మహత్య

కొవ్వూరు మండలంలో ఒకే రోజు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణానికి చెందిన వాలిశెట్టి రాంబాబు(54) ఉరివేసుకున్నారు. దొమ్మేరుకి చెందిన వరలక్ష్మి ఈనెల 20న 40మాత్రలు మింగిడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదులతో రెండు ఘటనలపై పట్టణ పోలీసులు విడివిడిగా కేసులు నమోదు చేశారు.
News April 22, 2025
రాజమండ్రి: సప్లమెంటరీ పరీక్షల ఫీజు గడువు ముగింపు

ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లింపునకు మంగళవారంతో గడువు ముగియనుందని ఆర్ఐవో నరసింహం తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఇకపై గడువు పొడిగించబడదన్నారు. అలాగే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఫీజు చెల్లింపునకు నేటితో గడువు ముగియనుందని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఫీజు చెల్లించని విద్యార్థులు సాయంత్రం 4గంటలలోగా ఆన్‌లైన్ ద్వారా చెల్లించవచ్చని తెలిపారు.