News May 14, 2024
ఓటు వేయని తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి

జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆరణి శ్రీనివాసులు సొంత ఊరు చిత్తూరు. గత ఎన్నికల్లో ఆయన అక్కడే ఓటు వేశారు. జనసేనలో చేరిన తర్వాత ఆయన తన ఓటును తిరుపతికి ట్రాన్స్‌ఫర్ పెట్టుకున్నారు. చివరి నిమిషంలో ఓటు బదిలీ కాలేదు. చిత్తూరులోనే ఆయన ఓటు ఉండిపోయింది. ఈక్రమంలో ఆయన నిన్న తనకు తానే ఓటు వేసుకోలేకపోయారు. అలాగే తిరుపతిలో పోలింగ్ సరళిని పరిశీలిస్తూ చిత్తూరుకు కూడా వెళ్లి ఓటు వేయలేదు.
Similar News
News October 29, 2025
చిత్తూరు: అంగన్వాడీల్లో CDPO తనిఖీలు

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో అంగన్వాడీలను తెరవలేదని Way2Newsలో <<18139694>>వార్త <<>>వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సీడీపీవో అరుణశ్రీ స్పందించారు. మండలంలోని అంగన్వాడీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందు మూడు రోజులు సెలవులు అని చెప్పి.. ఇవాళ తిరిగి ఓపెన్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారన్నారు. ఈక్రమంలో కాస్త ఆలస్యంగా సెంటర్లను ఓపెన్ చేశారని సీడీపీవో చెప్పారు. అన్ని సెంటర్లలో సిబ్బంది పనితీరు బాగుందన్నారు.
News October 29, 2025
చిత్తూరు: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి చిత్తూరు ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పోలీసు అధికారుల కథనం మేరకు.. పుంగనూరు మండలంలోని బాలికను 2019 ఏప్రిల్‌లో అత్యాచారం చేసిన కేసులో నేరం నిర్ధారణ కావడంతో కళ్యాణ్ అనే నిందితుడికి జడ్జి శంకర్రావు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించినట్టు తెలిపారు.
News October 29, 2025
కాణిపాకంలో పేలిన సిలిండర్

కాణిపాకం కాలనీ హౌసింగ్ విభాగంలో బుధవారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనలో చిన్న పాపమ్మకు గాయాలు అయినట్లు సమాచారం. క్షతగాత్రురాలిని తక్షణమే చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పేలుడు కారణంగా ఇంటి గోడలు, పైకప్పు భాగం దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


