News May 14, 2024
కాలువలకు మరమ్మతులు చేపట్టాలి: పవన్ కళ్యాణ్

ఏపీలో కాలువల నిర్వహణ పనులపై గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సరిగా దృష్టి పెట్టలేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విమర్శించారు. కాలువలు, వాటికి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలకు అవసరమైన నిర్వహణ, మరమ్మతులు చేపట్టాలని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఎన్నికలు ముగిసిన తరుణంలో మధ్యంతర ప్రభుత్వం ఈ అంశంపై జలవనరుల శాఖతో సమీక్షించి, మరమ్మతుల పనులను వేసవి ముగిసేలోగా పూర్తిచేయాలి’ అని పేర్కొన్నారు.
Similar News
News March 19, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 19, 2026
ఓటుకు నోటు దొంగ రేవంత్: హరీశ్ రావు

TG: వీధి దీపాలు కూడా సరిగా పెట్టడం చేత కాని సీఎం రేవంత్ విజన్ 2047 గురించి మాట్లాడుతున్నారని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. ప్రజలకు గ్యారంటీల పేరు చెప్పి, మాయ చేసి ఓట్లు దండుకున్న రేవంత్‌ను మించిన మారీచుడు ఇంకెవరైనా ఉంటారా అని ప్రశ్నించారు. రైతు ద్రోహి అని, ఓటుకు నోటు దొంగ అని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌కు దిక్కు లేదని, ప్రభుత్వానికి ముందుంది మొసళ్ల పండగని హెచ్చరించారు.
News March 19, 2026
ఈరోజు నమాజ్ వేళలు (19-3-2026) గురువారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.09 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:21 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.24 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.47 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.27 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.40 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


