News May 14, 2024

నాగర్ కర్నూల్: పెరిగిన పోలింగ్ శాతం..

image

నాగర్ కర్నూల్ లోక్ సభ పరిధిలో అచ్చంపేట, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, గద్వాల, అలంపూర్, వనపర్తి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. లోక్ సభ పరిధిలో మొత్తం 17,38,254 మంది ఓటర్లు ఉండగా, సాయంత్రం వరకు 69.01 శాతం ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో 62.23 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ సారి 6.78 శాతం ఓటింగ్ పెరిగింది.

Similar News

News March 25, 2026

మహబూబ్‌నగర్: ఉడిత్యాలలో అత్యధిక వర్షపాతం!

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గత 24 గంటల్లో అకాల వర్షం కురిసింది. బాలానగర్ మండలం ఉడిత్యాలలో అత్యధికంగా 25.5 మి.మీ వర్షపాతం నమోదైంది. మిడ్జిల్‌లో 7.3, దోనూరులో 4.5, రాజాపూర్‌లో 2.8 మి.మీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షాల వల్ల మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

MBNR: ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్: ఎస్పీ

image

న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు ఈనెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి పిలుపునిచ్చారు. కోర్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న వివిధ కేసులను రాజీ మార్గంలో, తక్కువ ఖర్చుతో సులభంగా పరిష్కరించుకునేందుకు ఇది ఉత్తమ మార్గమని ఆమె పేర్కొన్నారు. ఇరుపక్షాల అంగీకారంతో సమస్యలు సమసిపోతాయని ఎస్పీ వెల్లడించారు.