News May 14, 2024
హాలీవుడ్ సినిమా ఛాన్స్ కొట్టేసిన టబు!

బాలీవుడ్ సీనియర్ నటి టబు హాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేశారు. ప్రముఖ మూవీ సిరీస్ ‘డ్యూన్’ పార్ట్-3లో ఆమె నటించనున్నట్లు యూఎస్ మీడియా పేర్కొంది. ఈ కథనం ప్రకారం సినిమాలో టబు కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. డెనిస్ విల్లెనెయువ్ దర్శకత్వంలో వచ్చిన రెండు పార్టులు సూపర్ హిట్‌గా నిలిచాయి.
Similar News
News March 12, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 12, 2026
శుభ సమయం (12-3-2026) గురువారం

➤ తిథి: బహుళ నవమి తె.4.14 వరకు
➤ నక్షత్రం: మూల రా.10.54 వరకు
➤ శుభ సమయాలు: ఉ.7.00-7.11, ఉ.9.09-10.07, ఉ.10.57-మ.12.07, మ.1.06-మ.2.06, సా.4.04-సా.6.03
➤ రాహుకాలం: మ.1.30-మ.3.00
➤ యమగండం: ఉ.6.00-ఉ.7.30
➤ దుర్ముహూర్తం: ఉ.10.08-ఉ.10.56, మ.2.53-మ.3.40
➤ వర్జ్యం: రా.9.07-రా.10.54
➤ అమృత ఘడియలు: మ.3.49-సా.5.35
News March 12, 2026
జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు: CM రేవంత్

TG: రాష్ట్రంలోని ప్రధాన జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. భారీ వాహనాలను నియంత్రించడంతో పాటు సరకు రవాణా వాహనాలు వేగంగా వెళ్లేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు. NHలకు రింగు రోడ్ల అనుసంధానం, HYD-విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే నుంచి నాగార్జునసాగర్ చేరేందుకు గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణంపై అధ్యయనం చేయాలన్నారు.


