News May 14, 2024

కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావు: మోదీ

image

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావని ప్రధాని మోదీ అన్నారు. ఇండియా టుడేతో ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో హస్తం పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోదని చెప్పారు. యూపీ ప్రజలు కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించరని అన్నారు. వారి జీవితాలను మార్చిన ప్రత్యామ్నాయ మోడల్‌ను ఎంచుకుంటారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో 400 సీట్లకు పైగా గెలిచేందుకు తాము ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

Similar News

News March 17, 2026

BREAKING: పెరిగిన బంగారం, వెండి ధరలు

image

కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం, వెండి ధరలు ఇవాళ కాస్త పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,58,620కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,100 ఎగబాకి రూ.1,45,400 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.4వేలు పెరిగి రూ.2,80,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 17, 2026

జనగణనలో అడిగే ప్రశ్నలివే!

image

జనగణన-2027లో <<19386795>>భాగంగా<<>> అధికారులు ప్రజల నుంచి 33 ప్రశ్నలకు సమాధానాలను యాప్ ద్వారా సేకరిస్తారు. ముఖ్యంగా ఇంటి యజమాని వివరాలు, సొంతిల్లా/అద్దెదా, నీరు- విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్డి, వంటగ్యాస్, వాహనం, TV& ఫోన్ వంటి కనీస సౌకర్యాల గురించి తెలుసుకుంటారు. అలాగే వ్యక్తిగత వివరాలైన వయసు, లింగం, చదువు, కులం, మతం, మాతృభాష, ఆహార అలవాట్లు, వలస వివరాలు అడుగుతారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయో తెలుసుకుంటారు.

News March 17, 2026

పూజా సమయంలో ఏ రంగు దుస్తులు ధరించాలి?

image

పూజలో మనస్సును ప్రశాంతంగా ఉంచే సాత్విక రంగుల దుస్తులు ధరించడం శ్రేయస్కరం. సానుకూలతనిచ్చే పసుపు రంగు విష్ణుమూర్తికి ప్రీతికరం. తెలుపు పరిశుద్ధతకు, శాంతికి ప్రతీక. శివారాధనలో తెలుపు, శక్తి పూజల్లో ఎరుపు, గులాబీ ధరించడం ఉత్తమం. ఉదయం పూజకు పసుపు, తెలుపు రంగులు ఉత్తమం. అయితే, శని పూజలో మినహా నలుపు నిషిద్ధం. ముదురు నీలం రంగులను కూడా వాడకపోవడమే మంచిది. ఉతికిన శుభ్రమైన కాటన్ దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి.