News May 14, 2024
KNR: అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్!

కరీంనగర్ ఓటరు తీర్పు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కరీంనగర్ లోక్‌సభలో 28 మంది, పెద్దపల్లిలో 42 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత KNR రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ సమయంలో ఓటరు ఎవరివైపు నిలిచారనేది అభ్యర్థుల్లో టెన్షన్ పెంచింది. దీనికి తెరపడాలంటే జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే.
Similar News
News January 14, 2026
KNR జిల్లా ఉప సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడిగా నవీన్‌కుమార్ గౌడ్

కరీంనగర్ జిల్లా ఉప సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడిగా సైదాపూర్ ఉప సర్పంచ్ గోపగోని నవీన్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలో జరిగిన ఉప సర్పంచ్ల సమావేశంలో ఎన్నిక నిర్వహించారు. ప్రధాన కార్యదర్శిగా నామని విజేందర్, ఉపాధ్యక్షులుగా దొంతరవేనా రమేష్, గుండారపు మహేష్, కట్కమ్ మనీష్, సంయుక్త కార్యదర్శులుగా మిడిదొడ్డి సుధాకర్, జక్కుల అనిల్, అధికార ప్రతినిధిగా మేకల మహేష్‌ను ఎన్నుకున్నారు.
News January 14, 2026
KNR: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల కొరత

కరీంనగర్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల కొరత రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు శాపంగా మారింది. రెగ్యులర్ అధికారులు లేక జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు ఇన్‌ఛార్జులుగా కొనసాగుతున్నారు. తిమ్మాపూర్ వంటి చోట్ల 3 నెలల్లోనే నలుగురు అధికారులు మారడం గమనార్హం. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో జాప్యం జరుగుతోందని, తగిన అవగాహన లేక దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని క్రయవిక్రయదారులు వాపోతున్నారు.
News January 14, 2026
KNR: 6 నెలలకోసారి వైద్య పరీక్షలు తప్పనిసరి: కలెక్టర్

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహిళలు 6 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రేకుర్తిలోని పల్లె దవాఖానాను ఆమె సందర్శించారు. ఈ దవాఖానాలో నిర్వహిస్తున్న ‘ఆరోగ్య మహిళా వైద్య’ పరీక్షలను పరిశీలించారు. పలువురు మహిళలకు బీపీ పరీక్షలు చేయించి, వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రతి మహిళా వైద్య పరీక్షలు చేయించుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


