News May 14, 2024
పెద్దపల్లి, ఆదిలాబాద్ అభ్యర్థుల్లో టెన్షన్..టెన్షన్!

ఉమ్మడి ADB జిల్లాలోని ఓటరు తీర్పు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో 12 మంది పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 42 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ సమయంలో ఓటరు ఎవరివైపు నిలిచారనేది అభ్యర్థుల్లో టెన్షన్ పెంచింది. దీనికి తెరపడాలంటే జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే.
Similar News
News November 14, 2025
పోషకాహారం లక్ష్యంగా ముందుకు: కలెక్టర్ రాజర్షి షా

విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారం అందించే లక్ష్యంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం గుడిహత్నూర్ మండలం మన్నూర్ పీఎం శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆయన న్యూట్రీ గార్డెన్, ఆర్‌వో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్, డీఆర్డీఓ రవీందర్, మండల ప్రత్యేక అధికారి తదితరులు పాల్గొన్నారు.
News November 14, 2025
ADB: ఈనెల 19న బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు

ఆదిలాబాద్ జిల్లా క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-17 జిల్లాస్థాయి బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు ఈనెల 19న నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్ సెక్రటరీ రామేశ్వర్ తెలిపారు. ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయి. ఆసక్తిగల క్రీడాకారులు తమ ఆధార్ కార్డు, సర్టిఫికెట్లతో రిపోర్ట్ చేయాలని కోరారు. పాల్గొనేవారు తప్పనిసరిగా సొంతంగా క్రికెట్ కిట్, యూనిఫాం తీసుకురావాలని సూచించారు.
News November 13, 2025
బోథ్: రెండు రోజులు సోయా, మొక్కజొన్న కొనుగోళ్లు నిలిపివేత

AMC బోథ్ మార్కెట్‌లో సోయా, మొక్కజొన్న కొనుగోళ్లు రెండు రోజులు నిలిపివేస్తున్నట్లు సెంటర్ ఇన్‌ఛార్జ్ గోలి స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. బోథ్ మార్కెట్‌లో అధిక మొత్తంలో పంట నిల్వ ఉండడంతో నవంబర్ 14 నుంచి 16 వరకు కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు తెలిపారు. తిరిగి నవంబర్ 17 నుంచి యధావిధిగా కొనుగోళ్లు చేపడతామని, రైతులు గమనించి సహకరించాలని కోరారు.


