News May 14, 2024
గుడివాడలో ప్రజలను ఆకర్షిస్తున్న ప్రకటన

గుడివాడలో ఓ దుకాణం వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్ ప్రజలను ఆకర్షిస్తోంది. రాజకీయ నేతలు ఇచ్చిన సొమ్ము తీసుకొని ఓటు వేసిన ప్రజలకు తమ వద్ద వస్తువులు అమ్మబడవు అంటూ బ్యానర్లలో పేర్కొన్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే తమ వద్ద వస్తువులు కొనడానికి రావాలని రాసి ఉంది. ఈ బ్యానర్‌పై గుడివాడ వ్యాప్తంగా చర్చ సాగుతోంది.
Similar News
News March 18, 2026
కృష్ణా: పదో తరగతి హిందీ పరీక్షకు 233 మంది గైర్హాజరు

పదో తరగతి హిందీ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 21,312 మంది విద్యార్థులకు గాను 21,079 మంది పరీక్షకు హాజరయ్యారు. 233 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయ వర్గాలు తెలిపాయి. DLO 4, DEO 7, ACGE 5, డిస్ట్రిక్ట్ మోనటరింగ్ కో-ఆర్డినేటర్స్ 5, ఫ్లైయింగ్ స్క్వాడ్స్ 45 కేంద్రాలను తనిఖీ చేశాయి. ఓపెన్ స్కూల్ పరీక్షలకు సంబంధించి 598 మందికి 437 మంది హాజరయ్యారని తెలిపారు.
News March 18, 2026
పామర్రు: ‘పది’ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

పామర్రు జడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ డీకే బాలాజీ తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షా కేంద్రం వద్ద అధికారులు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరుగుతున్నాయని కలెక్టర్ చెప్పారు.
News March 18, 2026
కృష్ణా: గ్యాస్ సరఫరాలో సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఎల్‌పీజీ గ్యాస్ సిలెండర్ల సరఫరాలో నెలకొన్న ఇబ్బందుల దృష్ట్యా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గ్యాస్ సరఫరాలో ఎటువంటి సమస్యలున్నా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08672-242493కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ప్రతి రోజూ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని చెప్పారు.


