News May 14, 2024
ఈ ఏడాది తొలి గ్రాండ్ మాస్టర్‌గా శ్యామ్ నిఖిల్

తమిళనాడుకు చెందిన శ్యామ్ నిఖిల్ చరిత్ర సృష్టించారు. దుబాయ్ పోలీస్ మాస్టర్స్ ఫైనల్ రౌండ్ గేమ్‌ను డ్రా చేసుకోవడంతో తుది జీఎం నార్మ్ సాధించి గ్రాండ్ మాస్టర్‌గా నిలిచారు. 12 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆయన ఈ ఘనత అందుకున్నారు. దీంతో ఈ ఏడాది గ్రాండ్ మాస్టర్‌గా నిలిచిన తొలి భారత చెస్ ప్లేయర్‌గా రికార్డుకెక్కారు. దీంతో శ్యామ్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. శ్యామ్ భారత్ తరఫున 85వ గ్రాండ్ మాస్టర్ కావడం విశేషం.
Similar News
News March 21, 2026
ధురంధర్-2పై టాలీవుడ్ స్టార్ల ప్రశంసలు.. ప్రకాశ్ రాజ్ కామెంట్స్ వైరల్

ధురంధర్-2 సినిమాపై అల్లు అర్జున్, జూ.ఎన్టీఆర్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ సహా దక్షిణాది స్టార్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే బాలీవుడ్ స్టార్లు ఎవరూ స్పందించలేదు. ఇదే విషయంపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు ప్రకాశ్ రాజ్ ఇటీవల ఇచ్చిన సమాధానం వైరలవుతోంది. ఎవరో కోరడం వల్లే వీరు స్పందిస్తున్నారనే అర్థం వచ్చేలా ‘దక్షిణాదికి సైతం ఆబ్లిగేషన్స్ విస్తరిస్తున్నాయనడానికి ఇవి సూచనలు’ అని పేర్కొన్నారు.
News March 21, 2026
భార్యతో ఫోన్లో మాట్లాడుతుండగా మిస్సైల్ దాడి.. భారతీయుడు మృతి

సౌదీలో జరిగిన మిస్సైల్ దాడిలో ఓ భారతీయుడు మరణించాడు. యూపీకి చెందిన రవి గోపాల్ (26) రియాద్‌లోని ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మార్చి 18న భార్యతో ఫోన్లో మాట్లాడుతుండగా ఫ్యాక్టరీ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. మిస్సైల్ శకలాలు మీద పడటంతో రవి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడని బంధువులు చెప్పారు. మృతదేహాన్ని త్వరగా ఇండియాకు పంపేందుకు సౌదీలోని ఇండియన్ ఎంబసీ ప్రయత్నిస్తోంది.
News March 21, 2026
తిరుమల పవిత్రతకు భంగం కలగకుండా చర్యలు: సీఎం

AP: తిరుమలలో భక్తులకు అందే సౌకర్యాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించాలని CM CBN అధికారులను ఆదేశించారు. TTD పరిధిలోని ఆలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలన్నారు. బోర్డు సభ్యులు, అధికారులతో సమీక్షలో మాట్లాడుతూ ‘తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలను అరికట్టాలి. అత్యాధునిక CCTVలు, ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. కాలుష్యం లేకుండా చర్యలు తీసుకోవాలి’ అని సూచించారు.


